ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;వరంగల్ తూర్పు ఖిలా వరంగల్ వాకింగ్ గ్రౌండ్ లో నేడు జరిగిన సంక్షేమ సభ విజయవంతమైన సందర్బంగా యావత్తు ప్రజానీకానికి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలిపారు.
సభను సక్సెస్ చేసినందుకు ప్రజలకు,అధికారులకు,కార్పోరేటర్లకు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులకు,ఇంచార్జ్ లకు, డివిజన్ ఇంచార్జ్ లకు, ముఖ్య నాయకత్వానికి ,కార్యకర్తలకు,ప్రజలకు,మీడియాకు ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు
అదే విధంగా నేడు మంత్రి కేటీఆర్ సమయాభావం వలన సభా ప్రాంగణంలో పథకాలను ప్రారంభించారు. కానీ లబ్ధిదారులకు నేరుగా పథకాలను అందించలేకపోయారని తెలుపుకుంటు
కేసీఆర్ సంక్షేమ యొక్క లబ్ధిదారులైన బలబత్తుల కర్ణాకర్ కి బిసి బంధు చెక్కు అందించి నేడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.
రేపటి నేనే స్వయంగా డివిజన్లలో సమావేశం ఏర్పాటు చేసి లబ్ధిదారులకు సంక్షేమ పధకాలను అందించడం జరుగుతుంది.

Post A Comment: