ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
తెలంగాణ రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మాత్యులు కల్వకుంట్ల తారక రామారావు శుక్రవారం వరంగల్ ట్రై సిటీలో సుడిగాలి పర్యటన చేపట్టినారు. ఇందులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసినారు. ముందుగా ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు హెలికాప్టర్లో చేరుకొని అక్కడినుండి రోడ్డు మార్గాన అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు రిబ్బన్ కటింగ్ చేశారు కేటీఆర్ వెంట మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ ఎమ్మెల్యేలు వినయ భాస్కర్, ఆరూరి రమేష్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, నన్నపనేని నరేందర్, నగర మేయర్ గుండు సుధారాణి, తదితరులు మంత్రి వెంట ఉన్నారు. మొదట 30 లక్షల వ్యయంతో చేసిన ఎన్ఐటి జంక్షన్ ను ప్రారంభించారు, ప్రగతి నగర్ లోని 15 బస్తీ దావకాన ఎంఎల్డి , టెక్నాలజీ కార్యాలయాన్ని ప్రారంభించిన కేటీఆర్. అనంతరం ఈ కోటర్రాయిడ్ కార్యాలయం ఏర్పాటుకు అధికారులు ఎంతగానో కృషి చేశారన్నారు, అదేవిధంగా వై టు కే లాంటి సంక్షోభాలను ప్రపంచం ఎదుర్కొంది, భారతదేశ ప్రపంచంలో అత్యధికంగా మానవ వనరులు కలిగిన దేశంగా, భారత్ ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదగాలన్నారు. కేవలం హైదరాబాదులో పెట్టుబడులే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా 8 ఐటి అబ్బులను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఉన్నచోటనే ఉపాధి కల్పిస్తున్నామని, హైదరాబాద్కు దీటుగా కట్టడాలు, నిర్మాణాలు వరంగల్ లో కూడా జరుగుతున్నాయని, వరంగల్ విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నత స్థానాల్లో రాణిస్తున్నారు.
మడికొండ నందు క్వాడ్రాంట్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ కంపెనీ
ని ప్రారంభించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
ఈ కార్యక్రమంలో పాల్గోన్న మంత్రులు దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, నగర మేయర్ గుండు సుధారాణి, జెడ్పి చైర్మన్స్, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్,నగర పోలీసు కమీషనర్ ఏ.వి.రంగనాథ్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్ సి లు, ఎం ఎల్ఏ లు, మున్సిపల్ కమీషనర్ రిజ్వాన్ బాషా, క్వాడ్రాంట్ సీఈఓ వంశీ రెడ్డి, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ,తదితరులు పాల్గొన్నారు.


Post A Comment: