ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

రానున్న ఎన్నికల నేపథ్యంలో  జిల్లాలో అక్రమ మద్యం, గుడుంబా, గంజాయి, గ్రగ్స్  నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి  పుల్లా కరుణాకర్  తెలిపారు. శుక్రవారం  జిల్లా పోలీస్ కార్యాలయం లో జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారులతో గుడుంబా, గంజాయి, అక్రమ మద్యం నియంత్రణ పై తీసుకోవాల్సిన చర్యలపై ఎస్పి  సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పి  మాట్లాడుతూ జిల్లాలో గుడుంబా, గంజాయి, అక్రమ మద్యం నిర్మూలనకు  పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారులు సమన్వయంతో సమర్థవంంగా పనిచేసి  నియంత్రించాలని అన్నారు.  ఎవరైనా గుడుంబా, నాటు సారా,  తయారుచేసిన, కలిగి ఉన్న, రవాణా చేసిన, అమ్మిన, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని ఎస్పి కరుణాకర్   హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడైనా గుడుంబా, గంజాయి, అక్రమ మద్యం అమ్మకాలు జరుగుతుంటే వారి గురించి పోలీస్ లేదా ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందించాలని, ప్రజలను కోరారు. సమాచారం ఇచ్చిన వారి  వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. గుడుంబా, గంజాయి, డ్రగ్స్  నిర్మూలన  కోరకు జిల్లా వ్యాప్తంగా తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పి  తెలిపారు.  అలాగే  అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన  ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులలో ఇతర రాష్ట్రాల నుంచి, గుడుoబా, గంజాయి, డ్రగ్స్, అక్రమ మద్యం  రవాణా కాకుండా పనిచేయాలన్నారు.  ఈ కార్యక్రమంలో వరంగల్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ నాగేందర్, భూపాలపల్లి ఎక్సైజ్  సూపరింటెండెంట్ వి  శ్రీనివాస్, ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, భూపాలపల్లి డిఎస్పి ఏ. రాములు. కాటారం డిఎస్పి జి రామ్ మోహన్ రెడ్డి, ఎక్సైజ్, పోలీస్ ఇన్స్పెక్టర్లు ఎస్సైలు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: