మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
దేవరుప్పుల మండలం. రామరాజుపల్లిలో, పాలకుర్తి నియోజకవర్గం ఇంచార్జ్, అనుమాండ్ల ఝాన్సీ రెడ్డి చేపట్టిన కాంగ్రెస్ సంకల్పయాత్ర గడపగడపకు ఝాన్సీ రెడ్డి కార్యక్రమంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క పాల్గొని మాట్లాడారు.టిఆర్ఎస్ పార్టీకి గ్యారెంటీ లేకనే, బిఆర్ఎస్ గా పేరు మార్చుకుందన్నారు.కాంగ్రెస్ హయాంలోనే ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు కట్టించి ఇచ్చామని, రాబోయే ఎన్నికల్లో మరొక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించాలని ప్రజలందరినీ కోరారు... నియోజకవర్గంలో ప్రజలకు ఏమీ చేయలేని మంత్రి దయాకర్ రావు, ములుగు నియోజకవర్గానికి వచ్చి నీతులు చెబుతాడని విమర్శించారు..రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టి, వివిధ రూపాల్లో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అధికారం ఎవరికి శాశ్వతం కాదని, బ్రిటిష్ వాడిని తరిమిన గడ్డ, రజాకార్లు, దోపిడీదారులు, పెత్తందారులను తరిమిన గడ్డ మీద ప్రజలు చైతన్యంతో ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో ప్రజలందరి ఓటు తీర్పుతో,తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం లోకి రాబోతుందని చెప్పారు.. తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని, ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే రాజకీయాలలోకి వచ్చిన ఝాన్సీ రాజేందర్ రెడ్డిని దీవించాలన్నారు...

Post A Comment: