ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;


ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ ఆదేశించారు

గురువారం నాడు కలెక్టర్ సిక్త పట్నాయక్, అదనపు కలెక్టర్ మహేందర్ జీ తో కలిసి ఎన్నికల నిర్వహణ పై  మినీ కాన్ఫరెన్స్ హాల్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ బాధ్యతలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. 24/7 టీవీలో వచ్చే వీడియో ప్రకటనలు, పత్రిక ప్రకటనలు, పెయిడ్‌ న్యూస్‌పై నిఘా పెట్టాలని రోజువారీగా నివేదికను అందజేయాలని ఆదేశించారు.ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో ఎంసీఎంసీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్ట్లపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమించిన పోస్టులపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పెయిడ్ ఆర్టికల్ను గుర్తించడం, ప్రచురణ, ముం దస్తు అనుమతి లేకుండా ప్రకటనలను ప్రసారం చేయడం, సంబంధిత అభ్యర్థి ప్రచార వ్యయంలో వాటిని లెక్కించడం చేయాలని తెలిపారు. అలాగే సోషల్ మీడియాలో అభ్యర్థులు రాజకీయ పార్టీల ప్రకటనలకు వంటివి సకాలంలో ఆమోదిస్తూ, మం జూరు చేయాలని సూచించారు.

నియోజకవర్గాల వారీ గా ర్యాండమైజేషన్ ద్వారా ఎన్నికల సిబ్బందిని కేటాయించాలని అన్నారు..  పోలింగ్ సిబ్బంప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసై-డింగ్ అధికారులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.

ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది పోస్టల్ బ్యాలె ట్ తో ఓటు హక్కు ను విని-యోగిం చుకోవాలని సూచించారు.

ఎన్నికల సిబ్బంది కొరత లేకుంటే తక్షణమే ఇతర శాఖల సిబ్బంది తీసుకోవాలి అని ఆదేశించారు.

ఈ సమావేశం లో డిఆర్ఓ  గణేష్ సిపిఓ సత్యనారాయణ రెడ్డి, డిఈఓ  అబ్దుల్ హై, ఎంసి ఎంసి  కమిటీ సభ్యులు లక్ష్మణ్ కుమార్, భూపాల్, కృష్ణ రెడ్డి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: