ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 23వ డివిజన్ బిఆర్ఎస్ నాయకులు చిప్ప వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గురువారం 23వ డివిజన్ లోని వివిధ పార్టీలకు చెందిన సుమారు 35 మంది ఓసిటీలో క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారందరికీ ఎమ్మెల్యే నరేందర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ
ముఖ్యమంత్రి కెసిఆర్ మంత్రి కేటీఆర్ నాయకత్వాన తాను చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై వారందరు బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందని రాబోయే ఎన్నికల్లో వరంగల్ తూర్పులో బీఆర్ఎస్ జెండా ఎగిరేలా ప్రతి కార్యకర్త కష్ట పడాలని కార్యకర్తని కంటికి రెప్పలా కాపాడుకుంటు వారి అండగా ఉంటానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేందర్ తెలిపారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు,ముఖ్య నాయకులు హాజరయ్యారు.

Post A Comment: