మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
మంథని: మండలంలోని అడవి సోమనపల్లి , వెంకటాపూర్ గ్రామాలకు చెందిన పలువురు మహిళలు, మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు బోసెల్లి మౌనిక ఆధ్వర్యంలో, ఈరోజు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మంథని నియోజక వర్గం ముఖ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి సమక్షంలో బిజెపి పార్టీలో చేరారు. వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ...
కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలతో మహిళలకు ఎటువంటి మేలు జరగలేదని, మహిళలకు సంక్షేమ, అభివృద్ధి పథకాలు బిజెపితోనే సాధ్యమని, మహిళ శక్తిని గుర్తించి ప్రధాని నరేంద్ర మోడీ 33% రిజర్వేషన్ కల్పించి మహిళా సాధికారతకు కృషి చేస్తున్నారని, మహిళా శక్తిని నిరూపించుకునే సమయం ఆసన్నమైందని, ఈసారి మంథని నియోజకవర్గం ప్రాంత ప్రజలంతా మీ అమూల్యమైన ఓటు కమలం పువ్వు పై వేసి బిజెపిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు...ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి పోతారవేణి క్రాంతికుమార్, మండల అధ్యక్షులు విరబోయిన రాజేందర్, పట్టణ అధ్యక్షులు బూడిద తిరుపతి, బిఎస్ఏ ఇంచార్జ్ చిలువేరి సతీష్, మండల ఉపాధ్యక్షులు రేపాక శంకర్, ఎస్సీ మోర్చా మండలం అధ్యక్షులు బూడిద రాజు, సోషల్ మీడియా అసెంబ్లీ కన్వినర్ తోట్ల రాజు, సీనియర్ నాయకులు బోగోజు శ్రీనివాస్, కనుకుంట్ల పోచయ్య, కొరబోయిన మల్లిక్, బడుగు శ్రీనివాస్, బోసెల్లి శంకర్, యువ నాయకులు కురుమ శేఖర్, గురువేష్ ఆర్ల సదానందం, కొండూ లక్ష్మణ్, సిరారపు వెంకటేష్, ఉప్పు వరుణ్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..


Post A Comment: