ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వరంగల్ జిల్లా, తన స్వగ్రామం పర్వతగిరిలో తనకు చిన్నప్పుడు విద్యాబుద్ధులు నేర్పిన గురువర్యులు బొంపల్లి రంగారావు ఇంటికి స్వయంగా వెళ్లి సన్మానించి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తల్లిదండ్రుల తర్వాత గురువే దైవమని గురువులు విద్యాబుద్ధులు నేర్పకపోతే కళ్ళున్న మనుషులు గుడ్డోళ్లు గానే మిగిలిపోతారని జ్ఞానము నేర్పే గురువుల వల్లే తాను ఇంత స్థాయికి ఎదిగానని అన్నారు.
Post A Comment: