మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

దేశ సంక్షేమ రంగ చరిత్రలోనే తెలంగాణ అగ్రభాగాన నిలుస్తుంది. మానవీయకోణంలో రూపొందించిన పథకాల పట్ల నేడు దేశమంతటా ఆదరణ వ్యక్తమవుతుందని  తెలంగాణ ప్రభుత్వ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్  అన్నారు. తెలంగాణ ఆవతరణ దశాబ్ది ఉత్సవాల్లో బాగంగా  సింగరేణి కమ్యూనిటీ హాల్లో తెలంగాణ సంక్షేమ ఉత్సవాల్లో  ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే  పాల్గోని మాట్లాడారు...సంబ్బండ వర్గాల సంక్షేమ సారధి సిఎం కేసీఆర్‌ అని  10 ఎళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచి గా నిలిచిందన్నారు. సంక్షేమ పధకాల అమలులో దేశానికే ఆదర్శం మన  తెలంగాణ రాష్ట్రమన్నారు. తెలంగాణ రాష్ట్రం లో  కడుపులో ఉన్న పసిపాప నుండి పండు ముసలి వరకు సిఎం కేసీఆర్‌  సంక్షేమ పధకాలు అందిస్తాన్నరన్నారు. సంక్షేమం అందని గడప తెలంగాణ రాష్ట్రం లో లెదన్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటివరకు దాదాపు 364 సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంవా  అమలు చేస్తున్నారన్నారు. పేదింటి ఆడబిడ్డల పెండ్లికి లక్ష 116 రూపాయలు ఆర్థిక సాయం అందించే కల్యాణ లక్ష్మి షాదీ/ముబారక్,  వితంతు మహిళల కోసం వితంతు పింఛన్లు, దివ్యాంగులకు స్కూటీలు, ఒంటరి మహిళలు, 57 సంవత్సరాల నిండిన వయోవృద్ధులకు ఆసరా పెన్షన్లు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పురుడు పోసుకున్న తల్లుల కోసం కేసీఆర్ కిట్లు, ఆడబిడ్డ పుడితే 13వేలు, మగ బిడ్డ పుడితే 12వేల రూపాయల కానుక అందిస్తుందన్నారు. పాలిచ్చే తల్లులకు ఆరోగ్యలక్ష్మి, బాలింతల కోసం అంబులెన్స్ సౌకర్యం అమ్మఒడి, గర్భిణీల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించే న్యూట్రిషన్ కిట్, కౌమార దశలోని బాలికల కోసం ఆరోగ్య రక్ష, విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ఒక్కొక్కరికి గరిష్టంగా 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించే ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్కీం, ప్రీ మెట్రిక్- పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ లు ప్రభుత్వం అందిస్తుందన్నారు. మహిళలను వేధింపుల నుండి రక్షించే షీ టీమ్స్, గృహహింసకు గురవుతున్న మహిళలను అక్కున చేర్చుకునే సఖి భరోసా సెంటర్లు, హిందూ మహిళలకు దసరా కోసం బతుకమ్మ చీరలు, ముస్లింలకు రంజాన్ తోఫా, క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలు, షాది ఖానా/ కమ్యూనిటీ హాళ్లు, ఇమామ్/ మౌజములకు గౌరవ వేతనం,  57 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించే ఆరోగ్య మహిళ, కంటి వెలుగు, బస్తీ దవాఖానలు ఎర్పాటు చేశారన్నారు. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు అండగా వీ హబ్- టీ హబ్, విద్యార్థుల కోసం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్, మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల విద్యాలయాలు, కస్తూరిబా పాఠశాలలు, సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం, ఉచిత పుస్తకాలు, యూనిఫామ్స్, మన ఊరు- మనబడి, రైతులకు, ఎస్సీ నివాస గృహాలకు, రజక లాండ్రీలకు, నాయి బ్రాహ్మణ సెలూన్లకు ఉచిత విద్యుత్, దళితుల దశ మార్చే దళిత బంధు, రైతన్నల వ్యవసాయానికి సాయంగా రైతుబంధు-రైతు బీమా, భూమి రిజిస్ట్రేషన్ కోసం ధరణి పోర్టల్, రైతు కల్లాలు, గొర్రెలు, చేప పిల్లలు-రొయ్య పిల్లల పంపిణీ, కులాంతర వివాహ ప్రోత్సాహకాలు, నిరుపేదల కోసం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, మూడు లక్షల ఆర్థిక సాయం అందించే గృహలక్ష్మి,  రేషన్ కార్డులు, చెరువులను పునరుద్ధరించే మిషన్ కాకతీయ, ఇంటింటికి శుద్ధి చేసిన తాగునీటినందించే మిషన్ భగీరథ, గ్రామాల్లో పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన కోసం పల్లె ప్రగతి -పట్టణ ప్రగతి, పల్లె, పట్టణ ప్రకృతి వనాలు, హరితహారం, గ్రామీణ, పట్టణ క్రీడా ప్రాంగణాలు, రైతు వేదికలు, ప్రమాదవశాత్తు మరణించిన సింగరేణి కార్మికులకు 10 లక్షలు అందించే సింగరేణి మ్యాచింగ్ గ్రాంట్, ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ, ఉద్యోగ విరమణ వయస్సు 61 కి పెంపు, ఆఖరి సఫర్, పరలోక, వైకుంఠ రథాలు, వైకుంఠధామాలు.. ఇలా ఒకటా రెండా మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 364 పథకాలు ప్రారంభించి అమలు చేస్తున్నారన్నారు. మన రామగుండం రామగుండం నియోజకవర్గంలో 2014 నుండి 2022 వరకు 18,549 కొత్త పెన్షన్లు మంజూరు చేయబడ్డాయి.

ఈ 9 సంవత్సరాల కాలంలో 321 కోట్ల 30 లక్షల రూపాయలు పెన్షన్ గా అందజేయబడింది. 2014లో 1435 మందికి ఆసరా పెన్షన్ అందుతుండగా 2023లో 28,416 మందికి ఆసరా పెన్షన్ అందుతోంది. అంటే ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఆసరా పెన్షన్ అందుకునే లబ్ధిదారుల సంఖ్య రెట్టింపు అయిందన్నారు. గత సంవత్సరం వృద్ధాప్య పెన్షన్ వయసు 65 సంవత్సరాల నుండి 57 సంవత్సరాలకు తగ్గించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆసరా పెన్షన్ 200 నుండి 2016 రూపాయలు, దివ్యాంగుల పెన్షన్ 3016 రూపాయలుగా పెంచబడింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2014 నుండి ఇప్పటివరకు 28 లక్షల 81 వేల 222 కొత్త పెన్షన్లు మంజూరు చేయబడ్డాయన్నారు. ఆడబిడ్డలకు పెళ్లి చేసిన నిరుపేదలకు ఆర్థిక భారం కొంతైనా తీర్చేందుకై 1 లక్ష 116 రూపాయలు కళ్యాణ లక్ష్మి/ షాది ముబారక్ పేరుతో మన రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోందని మన రామగుండం నియోజకవర్గంలో ఇప్పటివరకు 19,362 మంది లబ్ధిదారులకు 175 కోట్ల 56 లక్షల రూపాయలు చెక్కుల రూపేనా అందించడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, గోదావరిఖనిలో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ను ఆధునికరించాక ప్రసవాల సంఖ్య 30 నుండి 70 శాతానికి పెరిగింది. ఇప్పటివరకు 13వేల 848 కేసీఆర్ కిట్లను బాలింతలకు అందించడం జరిగింది.

 రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్  సబ్బండ వర్గాలకు సంక్షేమ పాలనను అందిస్తుండగా.. ఆ సంక్షేమ ఫలాలను మన రామగుండం నియోజకవర్గంలోని ప్రతి వర్గానికి, ప్రతి ఇంటికి చేరేలా కృషి చేస్తున్నాను. ఈ సంక్షేమ పాలన ఇలాగే కొనసాగాలంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్  రుణం తీర్చుకునేందుకు వారిని మరో మారు హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన బాధ్యత, అవసరం మనందరిపైనా ఉంది. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగీ అనిల్ కుమార్  డిప్యూటీ కలెక్టర్ లక్ష్మినారాయణ నారాయణ  మున్సిపల్ కమీషనర్ సుమన్ రావు కార్పరేటర్లు దొంత శ్రీనివాస్ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.. 

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: