మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పించే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆర్టీసీ సంస్థ ముందుకు అడుగులు వేస్తుందని అన్నారు. గోదావరిఖని డిపో ఆవరణలో విలేజ్ బస్ ఆఫీసర్లకు కిట్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రవాణా వ్యవస్థ బాగున్నప్పుడే ఆర్ధిక అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఇందుకు అనుగుణంగానే.. ప్రజలకు మెరుగైన సౌకర్యాలను అందించే దిశగా సీఎం కేసీఆర్ నేతత్వంలో ఆర్టీసీ ప్రణాళిక బద్ధ చర్యలను అమలు చేస్తుందన్నారు. గతంలో ఆర్టీసీ మూతపడే పరిస్థితి వచ్చిందని, ప్రస్తుతం ప్రజలకు ఆమోదయోగ్య సౌకర్యాలను కల్పించే స్థాయికి చేరడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఆర్టిసి సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వీబిఓ కార్యక్రమంతో ప్రజల ముంగిట్లోకి ఆర్టీసీ సేవలు చేరుతాయని అన్నారు. అంతే కాకుండా ఆర్టీసీ అధికారులకు, ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు సమన్వయం ఏర్పడుతుందని తెలిపారు. ఇటువంటి సేవలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులోకి రావడం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. అనంతరం ఎమ్మెల్యే విబిఓలకు కిట్లను పంపిణీ చేయగా, ఆర్టీసీ సిబ్బంది ఎమ్మెల్యే ను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ మల్లేశం, నాయకులు కాల్వ శ్రీనివాస్, పీచరా శ్రీనివాస్, అచ్చ వేణు, వంగవీరస్వామి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: