మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఐ ఎఫ్ టి యు రాష్ట్ర నాయకులు తోకల. రమేష్ అక్రమ అరెస్టును ఖండించాలని, అరెస్టు చేసిన తోకల రమేష్ ని వెంటనే విడుదల చేయాలని ఐఎఫ్టియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీళ్లు, నిధులు,నియామకాల నినాదంతో తెలంగాణ సెంటిమెంటుతో తెలంగాణలోని సకల జనులు ఉద్యమాలు, పోరాటాలు నిర్వహిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. తెలంగాణ సెంటిమెంటుతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రజల ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చకుండా ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా లేని విధంగా నిర్బంధ పద్ధతులను ప్రయోగిస్తున్నాడన్నారు. మంత్రులు, ముఖ్యమంత్రుల పర్యటనల సందర్భంగా ముందస్తు అరెస్టులు చేయడం తెలంగాణలోపరిపాటిగా మారిందన్నారు. ఇదే పద్ధతులు అవలంబిస్తే రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు అన్నారు. అక్రమ అరెస్టులను ప్రజలు ఖండించాలన్నారు.
Post A Comment: