మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
లక్ష్మి జీవన సొసైటీ వ్యవస్థాపకులు సప్న * ఆధ్వర్యంలో గత కొన్నేళ్లుగా మహిళలకు కుట్టు శిక్షణ నేర్పిస్తుండగా ఈరోజు వారికి సొసైటీ ద్వారా సర్టిఫికెట్లు మరియు కుట్టు మిషన్ల ను ముఖ్య అతిథిగా విచ్చేసిన 22వ డివిజన్ కార్పొరేటర్ *కౌశిక లత చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ మహిళలు ఇంట్లో వంట చేసుకుంటూ ఏం పని లేక ఆలోచిస్తూ కాలం వెళ్లదీయడం కంటే కుట్టు మిషన్ నేర్చుకున్నవారు స్వయం ఉపాధి పొందవచ్చునని భవిష్యత్తులో ఏదైనా పరిశ్రమలు పడితే అందులో కూడా మహిళలు ఈ కుట్టు మిషన్ల ద్వారా ఉపాధి పొందవచ్చునని నా వంతుగా భవిష్యత్తులో మీకు అండగా ఉంటానని ఈ సందర్భంగా *కౌశిక లత మాట్లాడారు. అంతే కాకుండా ఎన్నో వ్యయ ప్రయసాలకు ఓర్చి ఎలాంటి లాభ పేక్ష లేకుండా ఒక సొసైటీ ఏర్పాటు చేసి మహిళలకు శిక్షణ తో పాటు సబ్సిడీపై కుట్టు మిషన్లు కూడ అందివ్వడం చాలా గొప్ప విషయం అని ఈ సందర్భంగా నిర్వాహకులు*స్వప్న*ను అభినందిస్తున్నాని *కౌశిక లత అన్నారు. ఈ కార్యక్రమంలో *కుక్క గంగా ప్రసాద్,నిమ్మరాజుల రవి, మంద శ్రీనివాస్, సంధ్య, శకుంతల*తదితరులు ఉన్నారు
Post A Comment: