మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
ములుగు జిల్లా, వెంకటాపూర్:
కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి బి ఎల్
వర్మ ఆదివారం రోజున
రామప్ప దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు తీసుకురావడంతో పాటు, ఆలయ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని అన్నారు.
మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రామప్ప దేవాలయాన్ని సందర్శించగా జిల్లా అదనపు కలెక్టర్ వై వి గణేష్ బిఎల్ వర్మకు రామప్పలో పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా రామప్ప రామలింగేశ్వర స్వామికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. రామప్ప శిల్ప విశేషాలను తెలుసుకున్నారు. అనంతరం మండలంలోని బిజెపి సీనియర్ నాయకులను ప్రత్యేకంగా కలిసి పార్టీ అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా బి ఎల్ వర్మ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 9 ఏళ్ల పాలనలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను గడపగడపకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని అన్నారు. రామప్ప దేవాలయానికి ప్రపంచవ్యాప్తంగా వచ్చే సందర్శకుల కోసం మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


Post A Comment: