మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
సీపీఐ (మావోయిస్టు) పార్టీ కేంద్రకమిటీ పాలిబ్యూరో సభ్యులు కామ్రేడ్ కటకం సుదర్శన్ (ఆనంద్) మరణం పట్ల సీపీఐ(ఎం-ఎల్) ప్రజాపంథా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కమిటీ విచారం వ్యక్తం చేస్తూ, ఆయనకు విప్లవ జోహార్లు తెలియచేస్తున్నది.
సింగరేణి కార్మిక కుటుంబం నుంచి కార్మిక నాయకుడిగా ఎదిగి, భారత విప్లవోద్యమానికి అంకితమై చివరి శ్వాస దాకా పని చేశారు. ఆదివాసులు, పీడితులు, కార్మికులు, రైతుల కోసం ఎన్నో పోరాటాలు నిర్మించాడు. 1975 నుంచి 5 దశాబ్దాలు తన విప్లవ జీవితంలో, దండకారణ్యంలో ఆజ్ఞాత వీరుడిగా నిలిచాడు.
ఆయన నమ్ముకొన్న రాజకీయాల కోసం చివరి దాకా నిలబడి, అమరత్వం పొందడం ఎంతో ఉన్నతమై త్యాగం. ఆయనది ఆదర్శవంతమైన విప్లవ జీవితం.
కామ్రేడ్ కటకం సుదర్శనకు సీపీఐ (ఎం-ఎల్) ప్రజాపంథా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కమిటీ పక్షాన విప్లవ జోహార్లు తెలుపుతూ, ఆయన సహచరులకు, కుటుంబానికి సంతాప సానుభూతిని తెలుపుతున్నాం.

Post A Comment: