మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
సింగరేణి సంస్థ రామగుండం డివిజన్-2 పరిధి వకీల్ పల్లి గనిలో మొదటి షిఫ్ట్ లో విధులు నిర్వహిస్తున్న జనగామ నవీన్, నాగిని నగేష్ అనే కార్మికులపై సైడ్ గోడ కూలి పడడంతో గాయాలు కాగా,
సింగరేణి ఏరియా ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆసుపత్రికి వెళ్లి జనగామ నవీన్ ను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు.. నవీన్ కు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు..
సింగరేణి యాజమాన్యం ఉత్పత్తి పైనే శ్రద్ద చూపెడుతూ, కార్మికుల రక్షణను విస్మరిస్తున్నారని, భవిష్యత్తులో
ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా తగు చర్యలు తీసుకోవాలని యాజమాన్యాన్ని కోరారు..
వారి వెంట కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ మహంకాళీ స్వామి, నాయకులు పెండ్యాల మహేష్, మాటూరి సత్య ప్రసాద్, కదీర్, ఆరీఫ్, దొబ్బల శ్రీనివాస్, విజయ్, ఇర్ఫాన్, శివ, మాదరవేన కిరణ్, శంకర్ లతో పాటు తదితరులున్నారు..

Post A Comment: