మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
మహాదేవపూర్: మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని, ఎంపీపీ రాణీబాయి అధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో తాత్కాలికంగా నిర్మించబడిన తెలంగాణ అమర వీరుల స్తూపం వద్ద పూలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భగా ఎంపీపీ రాణీబాయి మాట్లాడుతూ.. తెలంగాణ జాతిపిత కేసీఅర్ సుధీర్ఘ కాలం శాంతియుతంగా, అహింస మార్గంలో తెలంగాణా రాష్ట్రం సాధించారని అన్నారు. సుమారు 1200 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ త్యాగం చేశారని, వారి త్యాగం వల్లనే నేడు మనం, మన రాష్ట్రం స్వేచ్ఛగా సుభిక్షంగా ఉన్నామని అన్నారు. అమర వీరుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆశిస్తూ పూలు వేసి నివాళులు అర్పించారు. ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల కార్యక్రమంలో తహాసిల్డార్ మాధవి, ఎంపిడిఓ రవీంద్రనాథ్, సర్పంచ్ శ్రీపతి బాపు, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యులు మసూద్ అలీ,సీడీపీఓ రాదికారెడ్డి, ఎంపీఓ ప్రసాద్, ఏపీఓ రమేష్, ఏపీఎం రవీందర్, డీటీ కృష్ణా, ఎన్వైసీ అధ్యక్షులు ప్రభాకర్, పాత్రికేయులు, ఐసీడీఎస్, ఐకేపీ, రెవెన్యూ, పంచాయితీ రాజ్ సిబ్బంది, గ్రామ ప్రముఖులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: