మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

గోదావరికిఖని లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామగుండం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐ ఎన్ టి యు సి జాతీయ కార్యదర్శి జనక్ ప్రసాద్  మాట్లాడుతూ నిన్న మంచిర్యాల పర్యటనకు వచ్చిన కేసీఆర్ సింగరేణి పై కపటపు ప్రేమ చూపిస్తున్నాడని. 

 ప్రైవేటీకరణ చేయబోము అని చెప్పుకుంటు పార్లమెంట్లో ప్రైవేటీకరణకి మద్దతు గా టిఆర్ఎస్ ఎంపీలు మద్దతు తెలిపిన మాట నిజం కాదా అని ప్రశ్నించారు . 

తెలంగాణ వచ్చిన తర్వాత సింగరేణిలో కొత్త ఉద్యోగాలు వచ్చాయని చెబుతున్న కేసీఆర్ గతంలో తెలంగాణ రాకముందు 70 వేల ఉన్న ఉద్యోగులు ఇప్పుడు 43 వేలకు ఎలా తగ్గిందని. 

డిపెండెంట్ ఉద్యోగాలు గతంలో కూడా ఉన్నాయని కేసీఆర్ కొత్తగా తెచ్చింది ఏమీ లేదని దుయ్యబట్టారు . 

 గతం లో  శ్రీరాంపూర్ సాక్షిగా చెప్పిన అనేక హామీలు నెరవేర్చక పోగా వాటిఊసే తీయలేదని అన్నారు. 

సింగరేణి కార్మికుల  సొంత ఇంటి కల ఇంకా నెరవేరలేదని కాంట్రాక్ట్ కార్మికుల హై పవర్ కమిటీ వేతనాల ఊసే తీయలేదని .పెండింగ్ లో ఉన్న డిమాండ్స్ మారుపేర్ల మార్పు, 35 నుండి 40 వయో పరిమితి పెంపు వంటి   వాటి అమలు గురించి ఒక మాట కూడా మాట్లాడలేదు అని . 

సింగరేణి రావాల్సిన బకాయిలను ఇవ్వకుండా  సింగరేణి కార్మికులను మోసం చేస్తున్నాడని ప్రజలు అంతా గమనిస్తున్నారని కేసీఆర్ చెప్పే మోసపూరితపు మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని  రాబోయే  ఎన్నికల్లో కేసీఆర్ కి తగిన బుద్ధి చెప్పాలని కార్మికులు చూస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి గారు , సెంట్రల్ సెక్రెటరీలు ఎత్తం కృష్ణ , బత్తుల పోచయ్య , ఐ ఎన్ టి యు సి జిల్లా అధ్యక్షులు వడ్డేపల్లి దాస్ , ఆర్ జీ-2 వైస్ ప్రెసిడెంట్ అక్బర్ అలీ , మందమర్రి వైస్ ప్రెసిడెంట్ దేవి భూమయ్య , మార్కండేయ , రాజయ్య . తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: