మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఎన్టిపిసి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను వెంటనే యాజమాన్యం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో ఈరోజు ఎన్టిపిసి గేట్ 2 రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా యునైటెడ్ ఫోరం నాయకులు మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్ల పట్ల ఎన్టిపిసి యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తు, అగ్రిమెంట్ అమలు జాప్యం చేస్తుందని తెలిపారు.
ఎన్టిపిసి సంస్థలో గత 35 సంవత్సరాల నుండి విద్యుత్ ఉత్పత్తి కోసం పనిచేస్తున్న 3500 మందికి పైగా కాంట్రాక్ట్ కార్మికులు అనేక రికార్డ్ జనరేషన్ అవార్డులను సాధించి మహారత్న కంపెనీగా అవతరించటం లో కాంట్రాక్టు కార్మికుల శ్రమ, చెమట లేకుండా ఈ స్థానానికి చేరుకోవడం సాధ్యం కాదన్నారు.
అలాంటి కార్మికుల కుటుంబాలు చాలీచాలని జీతాలతో దుర్భర జీవితాలు గడుపుతున్నారని, వెంటనే యాజమాన్యం కార్మిక సంఘాలతో చర్చించి అగ్రిమెంటును పూర్తిస్థాయిలో అమలు చేసి, పారిశ్రామిక ప్రాంతం అశాంతికి గురి కాకుండా చూడాలని, లేనియెడల 12/06/23 సోమవారం ఉదయం మొదటి షిఫ్ట్ నుండి నిరసన, పోరాటాలకు పిలుపునివ్వడం జరుగుతుందని, దానికి యజమాన్యం పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుందని హెచ్చరించారు.
రాస్తరోకో లో ఫోరం నాయకులు సీఐటీయు నాంసాని శంకర్, గీట్ల లక్ష్మారెడ్డి, ఐఎఫ్టీయు చిలుక శంకర్, బుచ్చన్న, బీఆర్ఎస్ ఇజ్జగిరి భూమయ్య, చింతల సత్యం, గోదావరి యూనియన్ ఆర్ రాజమల్లయ్య, ఐఎన్టియుసి ఎండి జమీల్, బిఎంఎస్ టీ శ్రీనివాస్, రాజిరెడ్డి,టిఎన్టియుసి ఏ శ్రీనివాస్, ఎం కొమురయ్య సిపిఐ ఎంఎల్ ప్రజా పంత తోకల రమేష్ తెలంగాణ రీజనల్ వర్కర్స్ యూనియన్ రాజు నాయకులు దండ రాఘవరెడ్డి, కాదశి మల్లేష్, కే రాజ్ కుమార్ మరియు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొ న్నారు.
Post A Comment: