మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
1).జిల్లాలోని ప్రభుత్వ భూములు ,చెరువు శిఖం భూములు, భూదాన భూములు, జంగు సిఫాయి భూములు ,రాజకీయ నాయకులు రియల్ ఎస్టేట్ గా మారి వారి ధన బలంతో రెవెన్యూ డిపార్ట్మెంటును వారి గుప్పెట్లో ఉంచుకొని వేలాది ఎకరాల భూములను రాజకీయ నాయకుల బినామీల పేర్లతో కబ్జాలు చేస్తూ ప్లాట్లుగా మార్చి కోట్లాది రూపాయలు దండుకుంటున్నారు, ఈ భూములన్నింటినీ 2001 నుండి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సర్వే జరిపించి భూ బకాసురుల నుండి భూములను స్వాధీన పరుచుకొని భవిష్యత్తు తరానికి ఉపయోగపడేలా నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
2). జిల్లావ్యాప్తంగా అర్హులైన నిరుపేదలకు 120 చదరపు గజాలతో భూమి ఇచ్చి ఇల్లు నిర్మించుకోవడానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.
3). గత అనేక సంవత్సరాలుగా వ్యవసాయం ద్వారా ఆధారపడి బ్రతుకుతున్న రైతుల పోడు భూములకు ఏ శరతు లేకుండా పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి వడ్డీ లేని పంట రుణాలు, పక్రృతి వల్ల దెబ్బతిన్న పంటలకు 50,000/- రూపాయలు నష్టపరిహారం మరియు రైతు బీమా పథకం అమలు చేయాలి, అర్హులైన నిరుపేద రైతులందరికీ మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.
4). రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలి, రైతులు పండించిన పంట ధాన్యము కొనుగోలు అయ్యేంతవరకు నిల్వ ఉంచడానికి ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో 5 ఎకరాల భూమిని కేటాయించి షెడ్లు ఏర్పాటు చేయాలి.
5). నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీరందిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం అది పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
6). ఉత్తర తెలంగాణను బొందల గడ్డ గా మారుస్తున్న నల్లబొగ్గు ఓపెన్ కాస్టులను రద్దుచేసి అండర్ గ్రౌండ్ మైన్స్ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం.
7). సింగరేణి OC మరియు పవర్ ప్లాంట్ సిమెంట్ ఫ్యాక్టరీ,RTC, మున్సిపాలిటీ, గ్రామపంచాయతీ వివిధ సంస్థలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
8). రైతు-కూలీలు, కౌలు రైతులకు ప్రమాద బీమా కింద 25 లక్షల రూపాయలు ఇవ్వాలని మరియు 60 సంవత్సరాలు నిండిన వారికి నెలకు 5000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.
9). అర్హులైన పేద ప్రజలందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలి, తెల్ల రేషన్ కార్డు ఉన్న పేద ప్రజలందరికీ బియ్యంతో పాటు 12 రకాల నిత్యవసర సరుకులు అందించాలని డిమాండ్ చేస్తున్నాం.
10). మహిళలపై జరుగుతున్న అన్ని రకాల దాడులకు కారణమైన మద్యం షాపులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
11). నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించాలని, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు వార్డు, గ్రామ, మండల స్థాయిలో ఏర్పాటు చేసి ఉచిత విద్యా విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

Post A Comment: