మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం కార్పొరేషన్ పరిధిలోని వివిధ వార్డులకు చెందిన కుటుంబ యజమానులు పక్షవాతం తో బాధపడుతు పనులు చేసుకోలేక కుటుంబ పోషణకు ఇబ్బంది పడుతున్న 40.49.5.22 38. డివిజన్ లకు చెందిన బత్తుల శ్రీదర్.ముద్దమల్ల వెంకటేష్.మహ్మద్ మౌలానా. మాదిరి రమేష్. బెజ్జాల సాయి మనోజ్ఞ
కుటుంబాలకు ప్రతినెల 10 కిలోల బియ్యం అందజేయున్నట్లు సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ గత నెలలోప్రకటించిన విషయం తెలిసిందే ఇచ్చిన మాట ప్రకారం శనివారం రోజున మడిపెల్లి మల్లేష్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ సభ్యులు ముత్యాల వివేక్ బాధిత కుటుంబాల ఇంటి దగ్గర కు వెళ్లి పది కిలోల బియ్యం అందజేశారు.
ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ మాట్లాడుతూ పక్షవాతంతో బాధపడుతూ ఇంటికి పరిమితమై పనులు చేసుకోలేక ఇల్లు గడవని పరిస్థితులు నెలకొన్నా కుటుంబాలకు సేవా స్ఫూర్తి ఫౌండేషన్ సభ్యుల సహకారంతో వీరికి మూడవ నెల బియ్యం అందజేయడం జరిగిందని. సేవా స్పూర్తి ఫౌండేషన్ కు ప్రతినెల సహకారాలు అందిస్తున్న ఫౌండేషన్ సభ్యులందరికీ బాధిత కుటుంబాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నా ఫౌండేషన్ ప్రతినిధులు.కొమ్మరాజుల సంపత్. ఓర్సు రవి. జుల వినయ్.మొమిన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు
Post A Comment: