మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం కార్పొరేషన్ మూడవ డివిజన్ మేడిపల్లి గ్రామంలోని పురాతన హనుమాన్ ఆలయ పుననిర్మాణం గ్రామ పెద్దల సహకారంతో జరుగుతుందని మూడవ డివిజన్ కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు గురువారం కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్ మేడిపల్లి గ్రామం లోని హనుమాన్ గుడిలో సతీష్ శర్మ పూజారి గ్రామస్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆధునికరణకు దాతలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సింగం మల్లికార్జున్ గౌడ్, పూసాల శ్రీనివాస్,ఆడెపు శంకర్ ముసిపట్ల రాజు మడ్డి రాజబాబు గౌడ్ సిద్దే వామన్ తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

Post A Comment: