చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం పల్లెర్ల గ్రామంలో బీర్ల ఫౌండేషన్ సౌజన్యంతో గ్రామస్తులకు వాటర్ క్యాన్లు పంపిణీ చేసిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బీర్ల ఐలయ్య. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన బీర్లఐలయ్య కు కోలాటం డప్పు
చప్పుల మధ్య భారీ జన సంద్రోహం తో ఘన స్వాగతం పలికారు. ముందుగా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సమావేశంలో పాల్గొని వాటర్ క్యాన్లను పంపిణీ చేశారు. ఆ తర్వాత గ్రామంలో పలువురికి బీర్ల ఫౌండేషన్ సౌజన్యంతో బీర్ల ఐలయ్య ఆర్థిక సహాయం
అందజేశారు. ఈ సమావేశంలో బీర్ల ఐలయ్య మాట్లాడుతూ. ఆలేరు నియోజకవర్గంలో రేపు జరగబోయే ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. ప్రజలందరూ ఈసారి
కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. భావి ప్రధాని రాహుల్ గాంధీ రైతుల కోసం రైతు డిక్లరేషన్ చేయడం జరిగిందని, దీని ద్వారా రాబోయే రోజుల్లో రైతులకు పెద్దపీట వేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా హైదరాబాదులో ప్రియాంక గాంధీ యువతకు యువ డిక్లరేషన్ చేయడం జరిగిందని ఈయువ డిక్లరేషన్ వల్ల యువకులకు పెద్దపీటవేయునట్లు తెలిపారు. అదే విధంగా గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి మాత్రమే గ్రామాల్లో ఉందని, ఎక్కడా కూడా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణం
చేయలేదని,ఇచ్చిన హామీలను నెరవేర్చని ఈ సీఎంను గద్దె దింపాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక మన బ్రతుకులు మారుతాయని అనుకుంటే ఏ వర్గానికి కూడా కేసీఆర్, న్యాయం చేయలేదని
తెలిపారు. కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులను ప్రజలు గుర్తుచేసారాని అన్నారు.
ప్రజలందరి ఆశీర్వాదం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 500 కే గ్యాస్, ఇందిరమ్మ
ఇల్లు,ఇలాంటి అనేక రకాల సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని తెలిపారు. దీంతోపాటు
ఆలేరు నియోజకవర్గం లో బీర్ల ఫౌండేషన్ సౌజన్యంతో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని, ఆలేరు నియోజకవర్గంలో కరోన సమయంలో ప్రతి గడపకు నిత్యవసర వస్తువులు మాస్కులు అందజేశామన్నారు. అదేవిధంగా ప్రతి గ్రామానికి మంచినీటిని అందజేయాలని సుమారు 170 గ్రామాలకు వాటర్ ఫిల్టర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీంతో పాటు నియోజకవర్గంలో ఎక్కడ
ఎవరికి ఏ ఆపద వచ్చినా నేను ముందుంటానాని హామీ ఇచ్చారు. బీర్ల ఫౌండేషన్ "సౌజన్యంతో సుమారు నాలుగు అంబులెన్సులు ప్రజలకు సేవలందిస్తున్నాయని పేర్కొన్నారు. కావున ఆలేరు నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడానికి మీ అందరి ఆశీర్వాదం ఇవ్వాలని కోరారు.
Post A Comment: