మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఎండ తీవ్రత కారణంగా.. బసంత్ నగర్ లో వడదెబ్బతో ఒక నిరుపేద యువతి మృతి చెందిన హృదయ విదారకర సంఘటన ఒకవైపు... ఆమె పార్టీవ దేహానికి కనీసం దహన సంస్కారాలు కూడా చేయలేని దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న కుటుంబం మరోవైపు... ఆఖరి మజిలీ లో.. స్థానికులు చేయి చేయి కలిపి... ఆ యువతి పార్థివ దేహానికి సంప్రదాయ పద్ధతిలో దహన సంస్కారాలు చేసి మానవత్వంను బతికించిన సంఘటన పలువురి హృదయాలను కదిలించింది. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బసంత్ నగర్ నివాసముండే నిరుపేద కుటుంబంలోని సుజాత అనే యువతి బుధవారం నాడు ఎండ తీవ్రత వల్ల వడదెబ్బ సోకి తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందింది. అయితే అప్పటికే అనేక కష్టాల్లో ఉన్న ఆ కుటుంబ సభ్యులకు అంత్యక్రియలు చేయడానికి కూడా ఆర్థిక స్తోమత లేకపోవడంతో మృతదేహం వద్దనే కూర్చొని గుండెల విశేల తల్లడిల్లి పోతున్నారు. ఈ సంఘటన తెలుసుకున్న స్థానికులు అంతా అక్కడికి చేరుకొని ఎవరికి తోచిన విధంగా వారు విరాళాలుగా పోగుచేసుకొని దాదాపు రూ.15 వేల వరకు అంత్యక్రియలు ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు అందజేసి మానవత్వం చాటుకున్నారు. కార్యక్రమంలో పలువురు దాతలు పాల్గొన్నారు. ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Post A Comment: