మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
స్థానిక ఆర్ జీ 1 ఏరియా ఇల్లందు గెస్ట్ హౌస్ లో ఆర్ జీ-1 జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ అధ్యక్షత న సింగరేణి సంస్థ నిర్వహించిన సి ఎం పి ఫ్ ట్రైపార్టియట్ సమావేశం లో ముఖ్య అతిథులుగా సింగరేణి డైరెక్టర్ పా బలరాం నాయక్ మరియు సి ఎం పి ఫ్ కమిషనర్ మీష్రా హాజరైన కార్యక్రమంలో పాల్గొని సి ఎం పి ఫ్ గురించిన పలు సమస్యల పై చర్చించిన ఐఎన్టియుసి సెక్రెటరీ జనరల్ శ్రీ జనక్ ప్రసాద్ . ముఖ్యంగా*1. సి ఎం పి ఫ్ వడ్డీ రేటు తగ్గకుండా చూడాలని .*2. భవిష్యత్ లో పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎక్కువ అయ్యి పని చేసే వల్ల సంఖ్య తగ్గుతుందని పెన్షన్ ఫండ్ బలోపేతం కొరకు బొగ్గు అమ్మే ప్రతి టన్ను పై ప్రస్తుతం యాజమాన్యం చెల్లిస్తున్న 10 రూపాయల 20 రూపాయలు కాకుండా 2% ప్రతి టన్ను పై చెల్లిస్తే పెన్షన్ ఫండ్ బలోపేతం అవుతుందని .*3. సింగరేణి లో చాలా మంది రిటైర్డ్ కార్మికులు వెయ్యి లోపు పెన్షన్ తీసుకుంటున్నారని . కోల్ మైన్స్ పెన్షన్ స్కీం-1998 ప్రకారం ప్రతి ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకు ఒక సారి సమీక్షించి సవరించి పెన్షన్ పెంచాలని.*4. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు సింగరేణి సంస్థ ఉద్యోగుల పదవి విరమణ వయసు 61 స పెంచినప్పటికీ పెరిగిన కాలానికి సి ఎం పి ఫ్ మరియు పెన్షన్ రావటం లేదని.*5. పదవి విరమణ పొందిన తరువాత కార్మికుడు రెండవ వివాహం చేసుకుంటే రెండవ భార్య కు పెన్షన్ చెల్లించాలని.*6. కాంట్రాక్ట్ కార్మికుల గత మూడు సంవత్సరాలుగా సి ఎం పి ఫ్ సెటిల్మెంట్ అవటం లేదని అలాగే మాస్టర్ లేకపోయినా 26 రోజులకు సి ఎం పి ఫ్ డిడక్ట్ చేయటం వల్ల వారు చాలా నష్ట పోతున్నారని.*7. పెన్షన్ లెక్కింపు లో బేసిక్, విడిఎ తో పాటు ఎస్ డి ఏకూడ కలపాలని.8. సి ఎం పి ఫ్ వారు ఒక మొబైల్ యాప్ ప్రవేశపెట్టాలని .9.సిఎంపిఫ్ ఆఫీస్ లో కార్మికులను గేట్ కూడా దాటనివ్వటం లేదని కేవలం బ్రోకర్లు ద్వారా వెళ్తేనే పని జరుగుతుందని దీన్ని తీవ్రంగా పరిగణించి తగు చర్యలు తీసుకోవాలని అలాగే సి ఎం పి ఫ్ ఆఫీస్ లో ఉన్న అరకొర ఉద్యోగులు వల్ల కార్మికుల సమస్యలు తొందరగా పరిష్కారం కావటం లేదని అన్నారు వీటికి సి ఎం పి ఫ్ కమిషనర్ మిశ్రా సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం అని హామీ ఇచ్చారు.*టి జి బి కెఎస్ తో పాటు అన్ని జాతీయ కార్మిక సంఘాలు పాల్గొన ఈ కార్యక్రమం లో ఐఎన్టియుసి నుండి సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి , సెంట్రల్ క్యాంపెనింగ్ ఇంఛార్జి వికాస్ కుమార్ యాదవ్ , సెంట్రల్ సెక్రెటరీ బత్తుల పోచయ్య పాల్గొన్నారు .

Post A Comment: