మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
-సదాశయ సేవలు కృషి అమోగం నేత్రదానం చేయడమంటే ఇతరుల జీవితాలలో వెలుగులు నింపడమని రాష్ట్ర సంక్షేమ శాఖ మాత్యులు కొప్పుల ఈశ్వర్ , ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గురువారం అంతర్గాం మండల పరిధిలోని పెద్దంపేట గ్రామానికి చెందిన నేత్ర దాత అముల దిలీప్ కుమార్ సంస్మరణ సభ సదాశయ ఫౌండేషన్ లింగమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి వారు హాజరై, మృతుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతుని కుటుంబాన్ని పరామర్శించి, ఓదార్చారు. ప్రతి వ్యక్తికి మరణం తప్పదని, మరణించిన తర్వాత అవయవ దానానికి కుటుంబాలు సహకరించాలని అన్నారు. అవయవ దానం పలు జీవితాలలో వెలుగులు నింపే ఓ గొప్ప వరమని అన్నారు. నేత్ర దాత కుటుంబం కు సదాశయ అభినందన పత్రం అందజేశారు వారి వెంట నగర మేయర్ బంగి అనిల్ కుమార్, జడ్పిటిసి ఆముల నారాయణ, కార్పొరేటర్లు పెంట రాజేష్, బాల రాజ్ కుమార్, నాయకులు పిటి స్వామి, పెద్దంపేట శంకర్ తదితరులు ఉన్నారు.
Post A Comment: