మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం ఎమ్మెల్యే కోరు కంటి చందర్ ఆదేశాల మేరకు విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూడవ డివిజన్ న్యూ పొరటపల్లి కమ్యూనిటీ హలో ఈరోజు డివిజన్ కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్ చేతుల మీదుగా కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ మహిళలకు ఉపాధి కల్పనే లక్ష్యంగా విజయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ కేంద్రాల ద్వారా ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ నేర్పిస్తున్న రామగుండం ఎమ్మెల్యే కోరు కంటి చందర్ కు కృతజ్ఞతలు తెలియజేస్తూ, మూడవ డివిజన్ లొ ఇప్పటివరకు మేడిపల్లి జంగాలపల్లి అన్నపూర్ణ కాలనీలో కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలలో 100 మందికి పైగా మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ ఇవ్వడం జరిగిందని, నేర్చుకున్న కొందరి మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ చేయడం జరిగిందని, కుట్టు మిషన్ నేర్చుకున్న ప్రతి ఒక్క మహిళలకు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు ఉచితంగా కుట్టుమిషన్ పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు బుర్ర శంకర్ గౌడ్ కుమ్మరి శారద విజయమ్మ ఫౌండేషన్ కోఆర్డినేటర్ శ్యామ్ ఆర్పి పర్జన అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
Post A Comment: