మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఆర్జీ త్రీ లో కాంట్రాక్ట్ కార్మికుల వివిధ విభాగాల్లో నిర్వహించిన మీటింగ్ లో పాల్గొన్న ఎస్ సి సిడబ్ల్యూయు ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల వెంకన్న మాట్లాడుతూ సింగరేణిలో జరుగుతున్న ప్రమాదాల్లో ఎంతోమంది కాంట్రాక్టు కార్మికులు చనిపోవడం, అంగవికలాంగులు కావడం జరిగింది ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు పోరాటాలు నిర్వహిస్తే ఓబి ఓనర్స్ మాత్రమే ఆ ప్రమాదానికి బాధ్యత వహించి ఆ కుటుంబాలకు తగు న్యాయం చేయటం జరుగుతుంది ఇతర విబాగాల్లో ప్రమాదాలకు గురైనప్పుడు కార్మికుల కుటుంబాలకు అన్యాయం జరుగుతున్నది. ఇట్టి విషయాన్ని పలు దపాలుగా యాజమాన్యం దృష్టికి తీసుకు వెళ్లిన సందర్భంగా కాంట్రాక్టు కార్మికులకు బ్యాంకుల ద్వారా ఇన్సూరెన్స్ కల్పిస్తామని అది 30 లక్షల వరకు వర్తించే విధంగా చూస్తామని చెప్పిన సింగరేణి యాజమాన్యం నేడు అధికారులకు, పర్మనెంట్ కార్మికులకు అమలు చేస్తూ కాంట్రాక్ట్ కార్మికులను విస్మరించడం సరికాదని, ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం ఇట్టి విషయంలో పూర్తిస్థాయి పరిశీలన చేసి సింగరేణిలోని అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులకు బ్యాంకు ఇన్సూరెన్స్ ఉచితంగా యాజమాన్యమే కల్పించాలని డిమాండ్ చేయడం జరిగింది
*ఈ యొక్క సమావేశంలో సుద్దాల మనోజ్, ఎస్ రజిత ఏ రాజేశం పి.రాజనర్సు పి.రమేష్ జి. నర్సయ్య, మోహన్, ఓదెమ్మ, లక్ష్మి ,రాములు, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు


Post A Comment: