మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం
రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తుందని దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక సంక్షేమ పథకాలు విజయవంతంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అమలు చేస్తున్నారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు గోదావరిఖని పట్టణంలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సోమవారం 8 వ తేదీన జరుగనున్న ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సభ ఎర్పాట్లు పోలీసు కమీషనర్ భవన ప్రారంభోత్సవం పలు అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ పోలీస్ కమీషనర్ రెమా రాజేశ్వరి రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పోరేషన్ చైర్మన్ కోలేటి దామెాదర్ సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పూర్తిస్థాయిలో పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేసి ప్రజలకు జవాబుదారీ తనం చేశారన్నారు. పోలీసు వ్యవస్థ పటిష్టం కోసం కమిషనరేట్ కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. బిజెపి కాంగ్రెస్ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో అబద్దాలను ప్రచారం చేస్తున్నారని అన్నారు.

Post A Comment: