ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ పోటీలను జిల్లాలో ఉత్సవంలా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి అధికారులను ఆదేశించారు.
ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ లో జిల్లాస్థాయి సీఎం కప్ పోటీల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా అధికారులతో ఆమె సమీక్షించారు. ఈ నెల 22 నుండి 24 వరకు 18 క్రీడాంశాలలో జరిగే ఈ పోటీలో దాదాపు 1700 మంది క్రీడాకారులు పాల్గొననున్నారనీ అన్నారు. పోటీల విజయవంత నిర్వహణకై జిల్లా అధికారులచే ఏర్పాటు చేసిన పలు కమిటీల బాధ్యులు జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంను సందర్శించి తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని క్రీడాకారులకు ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి క్రీడాకారులు, కోచ్, మేనేజర్లకు మూడు రోజులపాటు టిఫిన్, భోజనాన్ని సమకూర్చాలన్నారు. సానిటేషన్ పై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోని, మొబైల్ టాయ్లెట్ లను సమకూర్చాలన్నారు. సంబంధిత మండలాల ఎంపీడీఓలు మూడు రోజులపాటు నిర్ణీత సమయానికి ఆటగాళ్లను స్టేడియంకు తీసుకొచ్చేలా తగు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. క్రీడలను నిష్పక్షపాతంగా నిర్వహించి, ప్రతిభ గల క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయాలన్నారు. జిల్లాస్థాయి పోటీల నిర్వహణకు సంబంధించి నగరంలోని ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీల ద్వారా తగు ప్రచారం కల్పించి మూడు రోజులపాటు ఉత్సాహపూరిత వాతావరణాన్ని కల్పించాలన్నారు. క్రీడల ప్రారంభ ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తగు ఏర్పాటు చేయాలన్నారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ వాసుచంద్ర, డిఆర్డిఏ పీడి శ్రీనివాస్, డిఎంఅండ్ హెచ్ ఓ సాంబశివరావు, డివైఎస్ఓ అశోక్ కుమార్, డిఎం డబ్య్లు ఓ శ్రీను,డిఈఓ అబ్దుల్ హై, పిడి మెప్మా భద్రు,జిఎం ఇండస్ట్రీస్ హరి ప్రసాద్,డిసిఓ నాగేశ్వర్ రావు, డీసీపీ ఎంఏ బారి, డీసీపీ కర్ణాకర్, ఏసిపి కిరణ్ కుమార్,ఏసిపి శ్రీనివాస్, తదితర అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: