ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
వరంగల్ మహా నగర పాలక సంస్థ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్ఐ యు డి స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, ఆదేశించారు.
శుక్రవారం హనుమకొండ లోని కుడా కార్యాలయ సమావేశ మందిరంలో నగర మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సుందర్ రాజ్, హనుమకొండ వరంగల్ జిల్లా కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య లతో కలిసి జి డబ్ల్యు ఎం సి, కుడా రెవెన్యూ పబ్లిక్ హెల్త్ ఇరిగేషన్ అధికారులతో పలు పథకాల కింద చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించి సమర్ధ నిర్వహణకు దిశా నిర్దేశం చేశారు.
జిడబ్ల్యు ఎం సి ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులైన గ్రేటర్ వరంగల్ లోని 4 నియోజకవర్గాల్లో ప్రతీది ఐదు కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న నాలుగు స్టేడియాల నిర్మాణాలు, ముంపునకు గురి కాకుండా కార్యాచరణ ప్రణాళిక అమలు, సివిరేష్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటు, ఖాజీపేట జంక్షన్ విస్తరణ అభివృద్ధి పనులు, డ్రైన్స్, డక్ట్ ల నిర్మాణ పనుల పురోగతి, మల్టీపర్పస్ కమ్యూనిటీ హాళ్ల ఏర్పాటు, నాలాల ఆడిట్ తదితరుల పనుల పురోగతిని సమీక్షించి పనుల్లో మరింత వేగం పెంచి అన్ని పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
అదే విధంగా కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న కాలోజీ కళా క్షేత్రం, వరంగల్ బస్ స్టేషన్ నవీకరణ, భద్రకాళి మాడవీధులు ఏర్పాటు, ఇన్నర్ రింగ్ రోడ్, హనంకొండ బస్ స్టేషన్ నవీకరణ, కాకతీయ మ్యూజికల్ గార్డెన్ పునరుద్ధరణ, తదితర పనుల ప్రగతిని సమీక్షించారు.
గ్రేటర్ వరంగల్ లో తాగునీటి సరఫరా పై సమీక్షిస్తూ మున్సిపల్ శాఖ మాత్యులు కేటీఆర్ గారి చాలా మేరకు వరంగల్ కు ప్రత్యేక అధికారిని నియమించి వారు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమర్పించిన నివేదికను అమలు చేస్తూ రూ 10 కోట్లు వెచ్చించి అవసరమైన స్లీవ్స్ వాల్స్, పైప్ లైన్లు ఏర్పాటు, మార్చడం, ఫీడర్ ట్రంక్ ఏర్పాటు, లికేజీలు ఆరికట్టడం, ఫ్లోమీటర్లు ఏర్పాటుచేసి అన్ని ప్రాంతాలలోని చివరి ఇంటి వరకు ప్రతి రోజు నీరందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ముంపు నివారణ చర్యలు భాగంగా వర్షాకాలం ప్రారంభానికి ముందే చేపడుతున్న 33 ప్రధాన నాలాల పూడికతీత 70 శాతం పూర్తయిందని, ఈనెల చివరికల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి కావాలన్నారు. మహానగరం లోగల చెరువులు నగరానికి సమీపంలో ఉన్న చెరువుల నీటిని ముందుగానే తొలగించి, అధిక వర్షం పడినచో లోతట్టు ప్రాంతాలు నీటిలో మునగకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.
నగరంలో మిషన్ భగీరథ కింద తాగునీటి సరఫరా పెరిగిందని జగవంతంగా విస్తరిస్తున్న నేపథ్యంలో తాగునీటి సరఫరకు ఇబ్బందులు ఉన్నా 51 కాలనీలోని ఇన్ లవ్ మిషన్ భగీరథ రెండో విడతలో నీటిని సరఫరా చేయుటకు ప్రతిపాదనలు వెంటనే సమర్పించాలన్నారు.
స్మార్ట్ సిటీ పథకం కింద కొనసాగుతున్న పనులు దాదాపుగా పూర్తయ్యాయని మిగిలిన పనులు తొలితంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
వరద ముంపు నివారణ చర్యల్లో భాగంగా రూ. 234 కోట్లతో చేపడుతున్న రిటైనింగ్ వాల్స్, డక్ట్ పనులలో వేగం పెంచి త్వరితంగా పూర్తి చేయాలన్నారు.
జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉంటూ మాన్సూన్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం, డిఆర్ఎప్ టీం ల సమన్వయంతో ఒక్క కాలనీ కూడా నీటిలో ముందుగా కుండా ముందస్తుగా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు.
గ్రేటర్ వరంగల్ లోని 4 నియోజకవర్గాల్లో ప్రతీది ఐదు కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న నాలుగు స్టేడియాల త్వరితగతిన టెండర్ ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణాలను ఆగస్టు నాటికి పూర్తి చేయాలన్నారు.
వరంగల్ బస్ స్టేషన్ శంకుస్థాపనకు మొదటి వారంలో ఏర్పాట్లు చేయాలన్నారు. కాకతీయ మ్యూజికల్ గార్డెన్ పునరుద్దరణ పనులు వేగవంతంగా చేయాలన్నారు.
వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్ కు అవసరమైన భూ సేకరణ ప్రక్రియ పూర్తయినందున వెంటనే టెండర్ ప్రకీయ పూర్తి చేసి రోడ్డు నిర్మాణ పనులను వచ్చే నెలలో ప్రారంభించేలా చూడాలన్నారు.
నగర మేయర్
గుండు సుధారాణి మాట్లాడుతూ వరంగల్ మహానగరంలో తాగునీటి సరఫరా నిర్వహణలో సిబ్బంది కొరత ఉందని, ప్రతిపాదించిన 125 మందిని న్యాక్ ద్వారా త్వరగా నియమించాలని కోరారు. పెండింగ్ లో ఉన్న ముంపు నివారణ నిధులు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి త్వరగా మంజూరు చేయించాలన్నారు.
అంతకుముందు కాలోజీ కళాక్షేత్రం పనుల పురోగతి క్షేత్ర స్థాయిలో పరిశీలించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధిక మెన్ అండ్ మెటీరియల్ పెంచి ఆగస్ట్ 15 కల్లా కాళోజీ కళా క్షేత్రం పూర్తి కావాలని ఆదేశించారు.
ఖాజీపేట్ జంక్షన్ ను క్షేత్రస్థాయిలో వారు పరిశీలించి సుందరంగా జంక్షన్ను అభివృద్ధి చేయుటకు అధికారులకు వారు పలు సూచనలు చేశారు.
ఈ సమీక్షలో అదనపు కలెక్టర్లు తానాజీ, సంధ్యారాణి, బల్దియా కూడా ఇరిగేషన్ రెవెన్యూ పబ్లిక్ హెల్త్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: