ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 




హన్మకొండ ;

వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 18,19వ డివిజన్ కార్పొరేటర్లు వస్కుల బాబు, ఓని భాస్కర్ అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల ముందస్తు ఆత్మీయ సన్నాహక సమావేశానికి  ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కార్యకర్తలను వారి వారి ఆర్థిక పరిస్థితి,ఎదుగుదలకు కావాల్సిన తోడ్పాటును అడిగి తెలుసుకున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన బిఆర్ఎస్ సర్కార్ ప్రజలకు గొప్ప పాలన అందిస్తుందని 

కార్యకర్తలే బిఆర్ఎస్ పార్టీ పట్టుకొమ్మలని ఎమ్మెల్యే అన్నారు.

కార్యకర్తలు పట్టుదలతో పని చేస్తూ మన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకొని పోయి వారికి అర్ధమయ్యే విధంగా వివరించాలని కోరారు.

పార్టీ బలోపేతానికి డివిజన్ల వారికి చేపట్టాల్సిన చర్యలు, కార్యకర్తల సంక్షేమం, అభివృద్ధిపై కూలంకషంగా ఎమ్మెల్యే చర్చించారు. డివిజన్ లోని సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే అందరి సమస్యల పరిష్కారం చూపి కాపాడుకుంటామని హామీ ఇచ్చారు.

డివిజన్లలో ఇప్పటికి పూర్తి స్థాయిలో రోడ్లు వేశామని మిగిలినవి త్వరలో పూర్తి చేస్తామని మేము చేస్తున్న ప్రగతి మీ కళ్ళముందే కనిపిస్తుందన్నారు.

నాటి ఉద్యమం నుండి నేటి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వనా మొక్కవోని దీక్షతో పని చేస్తున్నామని ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పని చేయాలని కార్యకర్తలందరికి పార్టీలో, ప్రభుత్వంలో సముచితమైన స్థానం కల్పిస్తామని 








ప్రభుత్వ పథకాలైన దళిత బంధు, గృహలక్ష్మీ, డబల్ బెడ్ రూమ్ ఇతర పథకాలలో అర్హులైన నిరుపేద కార్యకర్తలకు ప్రాధాన్యత కలిపిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

లీడర్లు కార్యకర్తల మధ్య సమన్వయంతో పని చేసి మన పార్టీని మరింత బలోపేతానికి కృషి చేయాలని కోరారు.

కార్యకర్తలలో కొత్త పాత అనే భేదం లేకుండా అందరం కలిసి కట్టుగా పని చేద్దామన్నారు

అన్ని రంగాల అభివృద్ధిలో తూర్పు నియోజకవర్గం దూసుకొనిపోతుందని విద్య వైద్యంలో భాగంగా 1100వందల కోట్లతో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విద్యారంగంలో భాగంగా 7 గురుకుల పాఠశాలలు తీసుకొచ్చామన్నారు,75 కోట్లతో బస్ స్టేషన్,కురగాయల మార్కెట్,పండ్ల మార్కెట్,వాడవాడన సిసి రోడ్లు,మహిళ కార్మిక భవనం, కలెక్టరేట్,అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు మరెన్నో అభివృద్ధి పనులను తాను ఎమ్మెల్యే అయ్యాక సాదించుకున్నామని 





ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ నాయకత్వనా ఇంత గొప్ప ప్రగతిని సాధించుకున్న మనం దానిని ప్రజల్లోకి తీసుకొని పోయి వివరించాలని కార్యకర్తలను కోరారు.

ప్రభుత్వం చేపడుతున్న పధకాలు కల్యాణ లక్ష్మీ, షాధిముబారక్, ఆసరా,రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్ తో పాటు మరెన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తుందని

మనం చేస్తున్న ప్రగతి,అభివృద్ధి ఓర్వలేక ఇతర పార్టీలు అక్కసు కక్కి మనపై దుష్ప్రచారం చేస్తున్నారని దానిని కార్యకర్తలు తిప్పి కొట్టాలని ఎమ్మెల్యే కోరారు

దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు మన ప్రభుత్వం అందిస్తున్నదని కార్యకర్తలుగా మనం మన ప్రభుత్వం చేసింది చెప్పుకోవాలని ఎమ్మెల్యే కోరారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు వస్కుల బాబు,ఓని భాస్కర్,మాజీ కార్పొరేటర్ కుందారపు రాజేందర్,బొట్ల సదానందం,18వ డివిజన్ అధ్యక్షులు గడ్డమీది రాజేష్,19వ డివిజన్ అధ్యక్షులు ఈటెల ఉమెందర్, బిఆర్ఎస్ నాయకులు జోగు చంద్రశేఖర్,గోరంట్ల మనోహర్ ఇతర ముఖ్య నాయకులు,మహిళా నాయకురాలులు,యూత్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: