మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఈనాడు కలకత్తాలో జరిగిన 11వ వేజ్ బోర్డు చర్చల్లో వేజ్ బోర్డు సంఘాల పాత్ర డూ... డూ బసవన్న మాదిరిగా ఉన్నది. కేవలం అలవెన్స్ లో గాని, ఇంటి అద్దెలో గాని, అండర్ గ్రౌండ్ అలవెన్సులలో పెంపుదల కేవలం ఒక శాతం నుంచి మూడు శాతం లోబడే ఉన్నది. గడచిన రెండు మూడు సంవత్సరాలు నుండి కరోనా పరిస్థితుల నేపథ్యంలో దేశంలో విపరీతంగా ధరలు పెరిగి సామాన్య ప్రజలు జీవించలేని పరిస్థితి ఉన్నది. వేజ్ బోర్డు సంఘాలు, బొగ్గు పరిశ్రమ యాజమాన్యాలు, కేంద్ర ప్రభుత్వము అలాంటి చర్యలు తీసుకోకపోగా బొగ్గు గని కార్మికులను అవమానపరిచే విధంగా కేవలం మూడు శాతానికి లోబడి పెంపదల చేయడం దుర్మార్గం. ఎంతో సాధిస్తామని, పెంపుదల మాతోనే సాధ్యమని, పోరాటాల చరిత్ర మాకే ఉన్నదని ఊదర గొట్టిన సంఘాలు మూడు శాతం లోబడి పెంపుపై కార్మిక వర్గానికి సమాధానమివ్వాలని డిమాండ్ చేస్తున్నాం. గత అనేక సంవత్సరాలుగా కాంట్రాక్టు కార్మికులకు సైతం వేతన ఒప్పందాన్ని వర్తింపజేయాలని డిమాండ్ ను వినిపిస్తున్నప్పటికిని వేజ్ బోర్డు సంఘాలు మాత్రం కనీసం చర్చను కూడా లేవనెత్తిన పాపాన పోలేదు. పోరాడే శక్తిని వేజు బోర్డు సంఘాలు కోల్పోయినట్లుగా కనిపిస్తున్నాయి. కాంట్రాక్టు కార్మికుల డిమాండే లేకుండా వేజ్ బోర్డు సమావేశాలు ముగిస్తే కాంట్రాక్టు కార్మికులంతా వేజు బోర్డు సంఘాలను నిలదీయాలని కార్మిక వర్గానికి ఐఎఫ్టియు పిలుపు నిచ్చింది
Post A Comment: