మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ముందుగా 19 శాతం మినిమం జీతం పెరుగుదలపై యజమాన్యం లిఖితపూర్వక హామీ ఇవ్వాలని యూనియన్లు కోరాయి. దానిపై కొలిండియా చైర్మన్ ప్రమోద్ అగర్వాల్ ప్రభుత్వ ఆమోదంతోనే 19% మినిమం జీతం పెరుగుదల ఒప్పుకోవటం జరిగిందని కొన్ని నిబంధనల కారణంగా వాటిపై తప్పకుండా స్పష్టత ఇస్తామని యజమాన్యం తెలియజేసినారు తదనంతరం మిగతా డిమాండ్లపై ఒక్కొక్కటి గా చర్చించి అంగీకారం కు వద్దామని చర్చ ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఐదు సంవత్సరాల వేతనం ఒప్పందం కాల పరిమితికి లోబడి 19 శాతం పెరుగుదల అనే అంశం 30.062021న ఉన్న బేసిక్కు, SDA,VDA, అటెండెన్స్ బోనస్ మొత్తం పై 19 శాతం పెరుగుదల లెక్కించి 01.7.2021 నాడు కొత్త బేసిక్' SDA, అటెండెన్స్ బోనస్ గా నిర్ణయించి అమలు చేస్తామని యజమాన్యం యూనియన్లు అంగీకరించడం జరిగింది.
ఇంక్రిమెంటు రేటును మూడు శాతం పాతదే కొనసాగుతుంది
కోల్ పిల్లర్ స్ప్రా కూడా మూడు శాతం పాతది కొనసాగుతుంది. ఓవర్ టైం సీలింగ్ ఎత్తివేయాలనే డిమాండ్ పై సుదీర్ఘమైన చర్చ జరిగింది. దీనిని నిర్ణయించకుండా పెండింగ్ పెట్టడం జరిగింది. జీతము పైసలలో కాకుండా పది రూపాయలకు రౌండింగ్ ఆఫ్ చేయటానికి నిర్ణయం జరిగింది. ఐదు రూపాయల కంటే తక్కువగా ఉంటే దిగువ స్థాయికి ఐదు రూపాయలు కంటే ఎక్కువగా ఉంటే ఎగువ స్థాయికి సరి చేస్తారు. డి ఏ 100% న్యూట్రలైజేషన్ చేస్తారు. అండర్ గ్రౌండ్ అలవెన్స్ ను యాజమాన్యం 9 శాతానికి ఎలాంటి ఫ్రీజింగ్ లేకుండా ఇస్తానన్నది. అలాగే 10% ఇవ్వాలంటే ఫ్రీజింగ్ చేస్తానన్నది. దానిపై యూనియన్లు ఫ్రీజింగ్ చేయవద్దని కోరాయి. దీనిని తదుపరి సమావేశంలో చర్చించి అమలు చేసుకోవాలి .
నైట్ షిఫ్ట్ అలవెన్స్ను (రాత్రి బదిలీ అలవెన్స్) 50 రూపాయలకు రోజుకు అమలు చేస్తారు. చార్జీ అలవెన్స్ ప్రస్తుతానికి యధాతధంగా కొనసాగుతుంది. కొన్నిటిపై స్టాండడేషన్ కమిటీలో నిర్ణయించి ఒప్పందం చేసుకుంటారు.
పారామెడికల్ సిబ్బంది నర్సింగ్ అలవెన్స్ 500 కు ఒప్పందం కుదిరింది.
మిగతా అంశాలు అలవెన్సులు, లీవులు, ఎల్టీసీ ఎల్టీసీలు, డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ సమస్యలు, కాంట్రాక్ట్ కార్మికుల జీతభత్యాలు ఇతర అంశాలు, 30% రిటైర్మెంట్ బెనిఫిట్స్ , దిగిపోయిన కార్మికుల మెడికల్ స్కీము, పెన్షన్ స్కీము తదితర పెండింగ్ అంశాలన్నీ తదుపరి సమావేశంలో చర్చించు కొనుటకు సమావేశాన్ని వాయిదా వేశారు.
సమావేశం సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది.19వ తారీకు సమావేశం లేదు తదుపరి సమావేశం మే నెలలో జరపటానికి యజమాన్యం అంగీకరించింది
Post A Comment: