మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఈనాడు కలకత్తాలో 11వ వేజ్ బోర్డు చర్చల్లో దేశవ్యాప్తంగా పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు వేజ్ బోర్డు వర్తింపజేయాలని గాని, ఒకటవ కేటగిరి వేతనాన్ని అమలు చేద్దామని గాని, కనీసం కాంట్రాక్టు కార్మికుల ప్రస్తావన కూడా తేకుండా వ్యవహరిస్తున్న వేజు బోర్డు సంఘాలవైఖరిని నిలదీయాలని కాంట్రాక్టు కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నాం.
కాంట్రాక్టు కార్మికుల కోసం తెగ పోరాటం చేస్తున్నామని పోరాటపోజు లు కొట్టే వేజు బోర్డు సంఘాలు 11వ వేజ్ బోర్డు చర్చల్లో మీ పోరాటం ఏమైంది అని ప్రశ్నిస్తున్నాం. సింగరేణి నుంచి శాశ్వత సభ్యులుగా ఉన్న వేజ్ బోర్డు సభ్యులు 11వ వేజ్ బోర్డులో పల్లెత్తు మాట మాట్లాడకుండా మౌనవ్రతం వహించడం ఎవరి ప్రయోజనాల కోసమో కాంట్రాక్టు కార్మికులంతా గ్రహించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.గత అనేక వేజు బోర్డు సందర్భాల్లో కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం చేయాలని IFTU ఆధ్వర్యంలో వేజ్ బోర్డు చర్చల ప్రదేశాలలో న్యూఢిల్లీ, కలకత్తా, నాగపూర్, హైదరాబాద్ లాంటి చోట్ల ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి వేజ్ బోర్డు దృష్టికి తీసుకురావడం జరిగింది. అయినప్పటికీనీ చిత్తశుద్ధి లేని వేజు బోర్డు సంఘాల వైఖరి మూలంగా కాంట్రాక్టు కార్మికులకు న్యాయం జరగడం లేదు. బయట పోరాట పోజులు కొట్టే శాశ్వత వేజ్ బోర్డు సంఘాల నేతలు సమావేశంలో ఎందుకు మాట్లాడలేదో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాము.
జీవో నెంబర్ 22 కోసం కొట్లాడుతున్నామని చెప్పుకుంటున్న సంఘాలు 11వ వేజుబోర్డు చర్చల్లో మాత్రం పల్లెత్తు మాట మాట్లాడకుండా కాంట్రాక్ట్ కార్మికులకు చేస్తున్న అన్యాయాన్ని కార్మికులంతా గమనించాలని కోరుతున్నాం.
భవిష్యత్తులో కూడా పోరాటాల ద్వారానే హక్కుల సాధనకు కదిలి రావాలని పిలుపునిస్తున్నాం
Post A Comment: