మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
గోదావరిఖని లో IFTU అధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతి సభ జరిగింది. ఈ సభ లో IFTU రాష్ట్ర నాయకులు తోకల రమేష్ హాజరై మాట్లాడుతూ
మహారాష్ట్రలోని పూణేలో ఏప్రిల్ 11, 1827న జన్మించిన జ్యోతిరావు గోవిందరావు ఫూలే సామాజిక నిచ్చెన యొక్క దిగువ స్థాయికి చెందిన కుటుంబంలో జన్మించారు. ఫూలే కుటుంబానికి చెందిన పురుషులు పూల వ్యాపారులుగా పనిచేశారు మరియు అప్పటి పాలకుడు పీష్వా బాజీ రావు చేత నియమించబడ్డారు,జ్యోతిరావు తండ్రి గోవిందరావు పూనాలో రైతు మరియు పూల వ్యాపారి మరియు అతని తల్లి చిమ్నాబాయి అతను చిన్నతనంలోనే మరణించాడు.
మహారాష్ట్రలోని పూణేలో ఏప్రిల్ 11, 1827న జన్మించినy జ్యోతిరావు గోవిందరావు ఫూలే సామాజిక నిచ్చెన యొక్క దిగువ స్థాయికి చెందిన కుటుంబంలో జన్మించారు. ఫూలే కుటుంబానికి చెందిన పురుషులు పూల వ్యాపారులుగా పనిచేశారు మరియు అప్పటి పాలకుడు పీష్వా బాజీ రావు చేత నియమించబడ్డారు, దీని కారణంగా కుటుంబం ఫూలే అనే ఇంటిపేరును స్వీకరించింది. మహాత్మ జ్యోతిరావు పూలే కుల నిర్మూలన కోసం చివరిదాకా పోరాడాడు. స్త్రీల హక్కుల కోసం విద్య కోసం బాల్య వివాహాల రద్దు కోసం పోరాడి సంఘసంస్కర్తగా పేరు తెచ్చుకున్నాడు విద్య ద్వారానే సమాజ మార్పు వస్తుందని పాఠశాలను నడిపించి ఎంతోమందికి విజ్ఞానాన్ని ప్రసాదించాడు. మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలు ప్రతి ఒక్కరు కొనసాగించాలని కుల రహిత సమాజం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. ఆయన స్థాపించిన సత్యశోధ సమాజ్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. *ఇంకా ఈ కార్యక్రమంలో IFTU నాయకులు నగునూరి పోశం, పి రాజేందర్, ఏ సారయ్య, కే వెంకటేష్,ఎన్ మదనమ్మ,, గుండ్ల పోశం, గొట్టే లక్ష్మీనారాయణ, సిహెచ్ ప్రమీల, పి లక్ష్మి, ఎండి నూర్జహాన్, ఏ మహేష్, ఓ సవిత, కే లత, బి మణెమ్మ, తిరుమల, రాధ,శంకర్, కనక లక్ష్మి అంజయ్య, శ్రీనివాస్ సుధాకర్ నరేష్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు..

Post A Comment: