మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం కార్పొరేషన్ పరిధి ఐదవ డివిజన్ నర్రశాలపల్లి కి చెందిన మహ్మద్ మౌలానా అనే పక్షవాతంతో బాధపడుతున్న బాధితునికి సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ మౌలానా కుటుంబానికి 10 కిలోల బియ్యం అందజేశారు అనంతరం ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ మాట్లాడుతూ రామగుండం కార్పొరేషన్ పరిధిలో పక్షవాతంతో బాధపడుతూ ఇంటికే పరిమితమైన నిరుపేదలు ఎవరైనా ఉంటే నాకు 9989772222 కు ఫోన్ ద్వారా తెలుపగలరని మల్లేష్ కోరారు ఈ యొక్క కార్యక్రమం సేవా స్ఫూర్తి ఫౌండేషన్ సభ్యుల సహకారంతో బాధితులకు ప్రతినెల 10 కిలోల బియ్యం అందజేయడం జరుగుతుందని ఫౌండేషన్ కు ప్రతినెల సహకారం అందిస్తున్న సభ్యులందరికీ ఈ సందర్భంగా పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజెస్తున్నాని మల్లేష్ అన్నారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు జూల వినయ్.మొమిన్ పాల్గొన్నారు

Post A Comment: