మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
అనుమతి లేకుండా విగ్రహ ప్రతిష్ట కు పూనుకున్న కాంగ్రెస్ నాయకులను ముస్త్యాల గ్రామస్తులు అడ్డుకున్నారు. ఆ గ్రామ చివర గల ఎర్ర చెరువు మత్తడి, కొత్త రోడ్డు మూలమలుపు వద్ద మహనీయుల విగ్రహాలు పెట్టాలని గతంలో ముస్త్యాల గ్రామస్తులు టిఆర్ఎస్ నాయకులకు, సింగరేణి జీఎం కు వినతి పత్రం ఇచ్చియుంటిరి. కాని దానికి అనుమతి ఇవ్వకుండా పెండింగ్ లో ఉన్న సమయంలో ముస్త్యాల గ్రామానికి చెందిన కొందరు కాంగ్రెస్ వారు మహనీయుల విగ్రహాలకు బదులు, సింగరేణి వారి నుండి ఎలాంటి అనుమతి లేకుండా శ్రీపాదరావు విగ్రహాన్ని పెట్టడానికి గద్దె నిర్మిస్తున్నారన్న విషయం తెలిసిన గ్రామస్తులు, టిఆర్ఎస్ నాయకులు అడ్డుకొని నిలుపుదల చేసినారు. ఆక్కడ మహనీయుల విగ్రహాలు లేదా అమరవీరుల విగ్రహాలను ప్రతిష్టించడం మంచిదని, ఎలాంటి రాజకీయ నాయకుల విగ్రహాలు పెట్టరాదని గ్రామస్తులు కాంగ్రెస్ వారికి హితువు పలికినారు. మహనీయుల చరిత్రను అవమానపరుస్తున్న కాంగ్రెస్ శ్రీధర్ బాబు వర్గీయులు ముస్త్యాల కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై కళాధర్ రెడ్డి, పోలీసు వారు వచ్చి విచారణ చేపట్టి, ఆ కాంగ్రెస్ నాయకుని విగ్రహ ప్రతిష్టకు ఎలాంటి (సింగరేణి,ప్రభుత్వ) అనుమతులు లేవని తేలడంతో నిలుపుదల చేయాలని ఆదేశించినారు. మహనీయులను విస్మరిస్తున్న కాంగ్రెస్ నాయకులకు భవిష్యత్ లో తగిన గుణపాఠం చెబుతామని ముస్త్యాల గ్రామస్తులు తీయజేశారు.

Post A Comment: