మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
గోదావరిఖని కేంద్రంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న భూ పోరాటంలో వేలాది మంది ఇల్లు లేని ప్రజలు పాల్గొంటున్నారు. వేల దరఖాస్తులతో ఈరోజు రామగుండం ఎమ్మార్వో కు వై యాకయ్య నాయకత్వంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం యాకయ్య మాట్లాడుతూ తక్షణమే భూ నిర్వాసితులకు పక్కా ఇల్లు కట్టించి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. రామగుండంఎమ్మార్వో హామీ ఇవ్వడంతో నిరసనకారులు వెనుతిరిగారు. ఇట్టి కార్యక్రమంలో వేల్పుల కుమారస్వామి, మహేశ్వరి, రమణాచారి, ఉపేందర్, మంద రవికుమార్, కాశిపేట రాజయ్య, కాoపెళ్లి శ్రీనివాస్, గుండ్ల రాకేష్, గద్దల అనిల్ కుమార్, ఏలూరు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: