మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం కార్పొరేషన్ పరిధి 22 డివిజన్ అయోధ్య నగర్ కు చెందిన గుర్రాల సురేష్ పక్షవాతంతో బాధపడుతున్న బాధితునికి బుధవారం రోజున సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ సురేష్ కుటుంబానికి 10 కిలోల బియ్యం అందజేశారు అనంతరం మల్లేష్ మాట్లాడుతూ రామగుండం అయోధ్య నగర్ కు చెందిన గుర్రాల సురేష్ గతంలో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడని పక్షవాతం రావడంతో ఇంటికే పరిమితమై ఎలాంటి పనులు చేసుకోలేక ఇబ్బందులు పడుతుండగా సురేష్ కుటుంబ పరిస్థితిని రామగుండం రైల్వే స్టేషన్ ఆటో యూనియన్ అధ్యక్షులు ఎండి రహీం ఫోన్ ద్వారా నాకు తెలియజేయగా బుధవారం రోజున 22వ వార్డు అయోధ్య నగర్ లోని సురేష్ ఇంటి వద్దకు వెళ్లి పది కిలోల బియ్యం అందజేశామని మల్లేష్ తెలిపారు ఈ కార్యక్రమానికి సహకరించిన సేవాస్ఫూర్తి ఫౌండేషన్ సభ్యులందరికీ సురేష్ కుటుంబం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని మల్లేష్ అన్నారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు జూల వినయ్.మొమిన్ పాల్గొన్నారు

Post A Comment: