మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
హాదేవపూర్/ తెలంగాణలో మారుమూల అటవీ ప్రాంత మండలం అయి, అభివృద్ధిలో వెనుకబడిన మహాదేవపూర్ మండల అభవృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు త్వరితంగా కేటాయించాలని రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు, రాష్ట్ర గిరిజన సంక్షమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ లకు మహాదేవపూర్ ఎంపీపీ రాణీ బాయి రామారావు, వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా, రామప్ప దేవాలయం లో ఏర్పాటు చేసిన ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రులను కలిసి ఎంపీపీ రాణీబాయి రామారావు వినతి పత్రాలు సమర్పించారు... మహాదేవపూర్ మండలం లోని గ్రామాలైన అంబటిపల్లి, సూరారం, రాపెళ్లి కోట ఎనకపల్లి, మహాదేవపూర్,కాళేశ్వరం బెగులూరు, ఎలికేశ్వరం, బొమ్మాపూర్, బ్రాహ్మణపల్లి, ఎడపల్లి, కుదురుపల్లి, అన్నారం, సండ్రుపల్లి, నాగ పెళ్లి, మద్దులపల్లి, పలుగుల,
మెట్ పల్లి, బిరాసాగర్, మద్దులపల్లి,పలుగుల కుంట్లం పూసుకుపల్లి, ఇప్పలబోర్, మజీద్ పల్లి గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, అంగన్ వాడి భవనాలు, కమ్యూనిటీ హాల్ లు, కాంపౌండ్ వాల్లు, స్కూల్ భవనాల నిర్మాణం కోసం ప్రత్యేకంగా కోటి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.. అతి త్వరలోనే మహాదేవపూర్ మండల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేస్తామని మంత్రలిద్దరు హామీ ఇచ్చారని ఎంపీపీ రాణీ బాయి రామారావు తెలిపారు..
Post A Comment: