మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
సామాజిక విప్లవ ఉద్యమ పితామహుడు -పూలే అని వారి యొక్క ఆలోచనలు ఆశయాలను ప్రతి ఒక్కరు ముందుకు తీసుకెళ్లాలని సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్ అన్నారు. జ్యోతిరావు పూలే 197వ జయంతి కార్యక్రమాన్ని మహనీయుల జయంతి రామగుండం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గోదావరిఖని రాజేష్ థియేటర్ ప్రాంతంలోని పూలే విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన సమతా సైనిక దళ్ పెద్దపల్లి జిల్లా నాయకులు దూట రాజుతో కలిసి హాజరై పులే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో వర్ణ వ్యవస్థ మూలంగా శూద్రులు అనబడే ఇప్పటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు విద్య లేకపోవడం వల్ల జ్ఞానం లేకుండా పోయిందని, జ్ఞానం లేకపోవడంతో, వివేకంలో లోపించిందని, వివేకం లేకపోవడంతో, ఐకమత్యం లోపించిందని ఐకమత్యం లేకపోవడంతో శక్తి లోపించిందని శక్తి లేకపోవడం వల్ల శూద్రులు అధోగతి పాలయ్యారని సమాజంలో శూద్రులు (అట్టడుగు వర్గాల వారి) ని చైతన్య పరచడంలో ఆయన చేసిన పోరాటాలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాల బాలికల కోసం పాఠశాలను ఏర్పాటు చేసి విద్యను ప్రోత్సహించాడన్నారు కుల వ్యతిరేక ఉద్యమంలో కూడా ఆయన ఎన్నో పోరాటాలను నిర్వహించారన్నారు. గొప్ప సంఘ సంస్కర్త అయిన పూలే యొక్క గొప్పతనాన్ని మానవత్వాన్ని అణగారిన ప్రజల కోసం ఆయన పోరాడిన ఉద్యమాలను ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని పూలే యొక్క అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు.

Post A Comment: