మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
మహాత్మ జ్యోతిరావు పూలే 197 జయంతి పురస్కరించుకొని బీసీ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది.. స్థానిక దుర్గా నగర్ లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో జరిగిన సమావేశంలో పెద్దపల్లి డిసిసి అధ్యక్షులు రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశంలోని అంటరానితనం అస్పష్టత కులవ్యత అంటే ఈ సమాజంలో బడుగు బలహీన వర్గాల చైతన్యం అవసరమని ఆనాడే గ్రహించి అనగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడ్డ మహోన్నత వ్యక్తి పూలే అని కొనియాడారు సమాజంలో కేవలం పురుషులు మాత్రమే కాకుండా స్త్రీలు కూడా విద్యను అభ్యసించాలని తద్వారా స్త్రీ చైతన్యం వికసిస్తుందని కలలు కనడమే కాక తన భార్య సావిత్రిబాయి పూలేను చదివించాడు భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది తద్వారా మహిళలకు విద్యాభ్యాసం నేర్పిన మహోన్నత మూర్తి జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని ఈ సమాజం ఎన్ని తరాలైన గుర్తుంచుకుంటుందని అలాంటి మహోన్నత వ్యక్తిని స్మరించే భాగ్యం కలిగినందుకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక కాంగ్రెస్ కార్యకర్తగ గర్విస్తున్నామని ఆయన ఆశయాల సాధన కోసం ఒక కాంగ్రెస్ కార్యకర్తగా అనునిత్యం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పోరాడుతానని తెలియజేశారు. కార్పొరేషన్ బీసీ సెల్ అధ్యక్షులు గట్ల రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు ఎస్సీ బీసీ మహిళా మైనారిటీ,
ఎన్.ఎస్.యు.ఐ, యువజన కాంగ్రెస్ విభాగం అధ్యక్షులు, నాయకులతో పాటు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Post A Comment: