మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం ప్రతినిధి: గోదావరిఖనిలో ఖాకీల తుపాకి తూటాలకు బలైన ముస్త్యాల గ్రామానికి చెందిన సింగరేణి గని కార్మికుడు అమరుడు పుట్ట నారాయణ 45 వ వర్ధంతి సందర్భంగా సోదరుడు పుట్ట రాజన్న సమక్షంలో, పుట్ట నారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, రామగుండం లోని గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిలో బుధవారం నాడు పేషెంట్లకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. తన సోదరుడు అమరుడు పుట్టనారాయణ జ్ఞాపకార్ధంగా వెలిసిన పుట్ట నారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టామని, పుట్ట నారాయణ జ్ఞాపకార్ధంగా 45 వ వర్ధంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఈ కార్యక్రమంలో పుట్ట రాజన్న, కంది నాగరాజు, గుండారపు శ్రీనివాస్, కండే రవీందర్, హాస్పిటల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు

Post A Comment: