ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
కమలాపూర్ లో టెన్త్ హిందీ పేపర్ లీక్ కేసులో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రిమాండ్ రిపోర్టులో ఎ1గా బండి సంజయ్ ని చేర్చారు. ఎ2 గా ప్రశాంత్, ఎ3 మహేష్, ఎ4 శివగణేష్ గా పోలీసులు రిమాండ్ రిపోర్టులో చూపించారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో సంజయ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు కొద్దిసేపటి క్రితమే హన్మకొండ మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరిచారు. కాసేపట్లో జడ్జి కేసుపై విచారణ చేపట్టనున్నారు.


Post A Comment: