మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పెద్దపల్లి, ఏప్రిల్ 5: గొప్ప రాజకీయ వేత్త- డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్ అన్నారు. ఈ మేరకు బుధవారం జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ముందు నిర్వహించిన బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లేష్, సమతా సైనిక దళ్ జిల్లా నాయకులు దూట రాజు, దళిత జె ఏ సి నాయకులు చంద్రశేఖర్ లతో కలిసి జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు ,నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ స్వాతంత్ర సమరయోధుడని, పోరాటయోధుడని, గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. అణగారిన ప్రజలకు సమాన హక్కుల కోసం కుల రహిత సమాజం కోసం పోరాడిన వ్యక్తి అని తెలిపారు . బాబు జగ్జీవన్ రామ్ వివిధ శాఖలకు కేంద్రమంత్రిగా దేశ ఉప ప్రధానిగా వారు దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. ఆయన ఆశయాలను మనమంతా ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ,

Post A Comment: