మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఆలయ ఫౌండేషన్ ద్వారా నిర్మించబడ్డ పరికిపండ్ల సత్యనారాయణ సంస్మరణ శంకర విజన్ సెంటర్ కంటి హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం రేపు మధ్యాహ్నం 3 గంటలకు విశిష్ట అతిధులతో ప్రారంభించడం జరుగుతుంది. బసంత్ నగర్ ముద్దుబిడ్డ మధ్యప్రదేశ్ సీనియర్ ఐఏఎస్ పరికిపండ్ల నరహరి ఆహ్వానం మేరకు కౌశిక హరన్న రేపు జరగబోయే కార్యక్రమం మీద చర్చించడం జరిగింది. కావున అభిమానులు రామగుండం నియోజిక వర్గ ప్రజలు ఈ ప్రాంతంలో కంటి హాస్పిటల్ నిర్మించి ఈ ప్రాంత ప్రజలకు తక్కువ ఖర్చుతో సేవలు అందించాలని ఉద్దేశంతో ఈ ప్రాంతం నుండి ఉన్నత స్థాయికి ఎదిగినా కూడా ఈ ప్రాంతాన్ని మర్చిపోకుండా వాళ్ల తండ్రిగారి జ్ఞాపకార్థం ఇక్కడ హాస్పిటల్ నిర్మించి ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి కి ధన్యవాదాలు తెలుపుతూ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఈ ప్రాంత ప్రజలు విచ్చేసి సద్వినియోగం చేసుకొని విజయవంతం చేయాలనీ కోరారు.

Post A Comment: