మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం కాంగ్రెస్ నాయకులు జనక్ ప్రసాద్ సూచన మేరకు నియోజక వర్గంలోని పాలకుర్తి మరియు ఈశాల తక్కలపల్లి లో కాంగ్రెస్ పార్టీ మరియు INTUC నాయకులు రైతు రుణమాఫీ దరఖాస్తుల ఉద్యమాన్ని రెండవ రోజు చేపట్టారు .2018 లో కేసీఆర్ ఒక లక్ష వరకు పంట రుణాలను మాఫీ చేస్తానని హామీ ఇచ్చారని ఇప్పటివరకు అది చేయలేదని ఇప్పుడు తీసుకున్న అప్పులు వడ్డీలతో అప్పుల కుప్పలుగా మారి రైతు కి బారం అయ్యాయి అని .
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు YSR ఏకకాలంలో ఒక లక్ష వరకు రుణాలు మాఫీ చేశారని గుర్తు చేశారు . రామగుండం నియోజకవర్గంలో ఉన్న ప్రతి రైతు కి తీసుకున్న పంట సహాయానికి తీసుకున్న రుణం మాఫీ అయ్యేవరకు జనక్ ప్రసాద్ నాయకత్వంలో పోరాటం చేస్తామని ఆ దరఖాస్తులను రైతుల తరపున నుండి వాటిని మండల ఎమ్మార్వో ఆఫీస్ కు , జిల్లా కలెక్టర్ కి , పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ,CLP లీడర్ భట్టి విక్రమార్క కు చేరాల చూస్తామని. అప్పటికి కెసిఆర్ రుణమాఫీ చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక వరంగల్ డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ చెప్పినట్టు ఏకకాలంలో రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని నాయకులు తెలిపారు .ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు దరఖాస్తులను నింపి నాయకులకు ఇవ్వడం జరిగింది .INTUC జిల్లా అధ్యక్షులు వడ్డేపల్లి దాస్ అధ్యక్షున జరిగిన ఈ కార్యక్రమంలో INTUC సెంట్రల్ సీనియర్ వైస్ ధర్మపురి , సెంట్రల్ సెక్రెటరీ కృష్ణ , పోచయ్య , RG-1 వైస్ ప్రెసిడెంట్ సదానందం , బ్రాంచ్ నాయకులు , జగన్మోహన్ , ఆంజనేయులు ,చంద్ర రెడ్డి , బర్ల మనోహర్ , తాటి రాజయ్య పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Post A Comment: