మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రాష్ట వ్యాప్త కార్యక్రమంలో భాగంగా అర్హులైన జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టిడబ్ల్యుజెఎఫ్) అధ్వర్యంలో బుధవారం సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా టిడబ్ల్యుజెఎఫ్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పోగుల విజయ్ కుమార్,రాష్ట్ర కార్యదర్శి పైడాకుల బిక్షపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి సుంక మహేష్ లు మాట్లాడుతూ రాష్ట్రంలో చాలా మంది జర్నలిస్టులు ఇండ్లు లేక అద్దె భవనాల్లో ఉంటూ కాలం వెళ్లదీస్తున్నారనీ అన్నారు. అర్హులైన జర్నలిస్టులకు ఇండ్లు లేదా ఇండ్ల స్థలాలు ఇవ్వాలనీ, పెండిగ్ లో ఉన్న అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల రక్షణకై ప్రత్యేక చట్టం తీసుకురావాలని అన్నారు. జర్నలిస్టుల ఇంటి స్థలాల కోసం రానున్న రోజుల్లో ఆందోళనలు ఉదృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చింతకింది చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి నారాయణదాసు అశోక్ లు సంపూర్ణ మద్దతు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. జర్నలిస్టులందరూ కలసికట్టుగా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు.సంతకాల సేకరణకు మద్దతు తెలిపిన ప్రెస్ క్లబ్ నాయకులకు,సభ్యులకు, జిల్లా వ్యాప్తంగా తరలి వచ్చిన జర్నలిస్టులకు,వివిధ పార్టీల నాయకులకు, స్వచ్ఛంద సంఘాల నాయకులకు, మేధావులకు, ప్రజాసంఘాల నాయకులకు జిల్లా కమిటీ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 100 మంది జర్నలిస్టులకు పైగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో జెఎన్టియూ జేఏసి స్టేట్ కన్వీనర్,సామాజిక కార్యకర్త ఆకుల స్వామి వివేక్ పటేల్, టిడబ్ల్యుజెఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పని సుదర్శన్, జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతి రెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి షబీర్ పాషా, కార్యవర్గ సభ్యులు నూక రామదాసు, శ్రీధర్, గోపి కృష్ణ, వెంకటేష్, మహేందర్, ఎం దేవేందర్, టిడబ్ల్యుజెఎఫ్ సభ్యులు, జర్నలిస్టులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Post A Comment: