మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
భూపాలపల్లి: జిల్లా కేంద్రం లోని పాఠశాలలలో బెస్ట్ అవలేబుల్ సీట్ల సంఖ్య పెంచాలని, తద్వారా జిల్లా కేంద్రం మరియు చుట్టు పక్కల గ్రామాలలోని ఎస్సీ విద్యార్థుల కు ఉచితంగా విద్యనభ్యసించే అవకాశం కలుగుతుందని
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ని బుధవారం రోజు
ప్రజా సంక్షేమ వేదిక రాష్ట్ర అధ్యక్షులు మడికొండ రఘుపతి కలిసి వినతిపత్రం సమర్పిస్తూ విజ్ఞప్తి చేయడం జరిగింది.
ఇంతకు ముందే జయశంకర్ జిల్లా కలెక్టర్ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లామని, ఈ సందర్బంగా రఘుపతి అన్నారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ, సంబంధిత అధికారుల దృష్టికి విషయం తీసుకెళ్లీ వీలైనంత తొందరలో సీట్ల సంఖ్య పెంచేలా కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమం లో ప్రజా సంక్షేమ వేదిక నాయకులు కె కిరణ్ కుమార్, అఖిల్, గోవిందు, రాజేందర్, మునిగాలా అశోక్, నర్లపూర్ రాజావీరు, అహల్య శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: