మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

> రామగుండం నియోజకవర్గంలో  అసాధ్యం అనుకున్న నువ్వు, సుసాధ్యం చేయడంలో రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందరన్న తర్వాతే మరెవరైనా, అని బీఆర్ఎస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు జిట్టవేన ప్రశాంత్ ముదిరాజ్ అన్నారు.

 రామగుండంకు సబ్ రిజిస్టర్ కార్యాలయం మంజూరు చేయించిన శుభ సందర్భంగా  గోదావరిఖని,మార్కండేయ్యా కాలనీ, శ్రీ లక్ష్మీ పంక్షన్ హాల్లో జరిగిన 76జీవో ద్వారా రామగుండం పట్టణ సింగరేణి స్థల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ను కలిసి వారికి పూల మాలతో సత్కారం చేసి సాలువతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. 

మొన్నటికి మొన్న రామగుండంకు రాదనుకున్న మెడికల్ కాలేజీని తెప్పించి ప్రతిపక్షాల నోళ్ళు మూయించిన ఎమ్మెల్యే కోరుకంటి చందర్అని అన్నారు.

 పెద్దపల్లిలో ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయంకు ఇండ్లు, భూముల క్రయవిక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ కోసం వెళ్లాలంటే రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులను చవిచూస్తున్నారని గుర్తించి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి రామగుండంకు సబ్ రిజిస్టర్ కార్యాలయంను రామగుండంకు తెప్పించాడని పేర్కొన్నారు.

 దీనివల్ల స్థానికులకే కాకుండా పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి చేకూరుతుందని పేర్కొన్నారు. 

ఈ కార్యాలయం వద్ద అనేక దుకాణాలు ఏర్పాటు చేసుకొని ఎంతోమంది స్వయం ఉపాధి పొందే అవకాశం ఉంటుందని గుర్తు చేశారు. ఇంకా రామగుండంలో గత కొన్ని దశాబ్దాల కాలంలో నుండి సింగరేణి స్థలాల్లోలో నివసిస్తున్నటువంటి వారి కోసం 76జీవో ద్వారా పక్క పట్టాలు ఇప్పించిన ఘనత ఎమ్మెల్యే కోరుకంటి చందరన్నకే దక్కుతుందని తెలిపారు.

అలాగే ఐటీ పార్కు ఏర్పాటుకు కూడా కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మరియు రామగుండం నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక అయినటువంటి రామగుండంకు రెవెన్యూ డివిజన్ కార్యాలయానికి కృషి చేయాలని కోరారు.

రాష్ట్రంలో కేసీఆర్, రామగుండంలో చంద్రుడు ఈ స్థానాలను ఎవరు పూడ్చలేరని, రాబోయే ఎన్నికల్లో మళ్లీ ఇక్కడ గులాబీ జెండా ఎగరడం ఖాయమని, ఎమ్మెల్యే కోరు కంటి చందరన్నను త్వరలోనే ఇక్కడి ప్రజలు మంత్రిగా చూడబోతున్నారని  జోస్యం చెప్పారు. 

ఒక ఎమ్మెల్యే గానే ఉంటే రామగుండంకు ఇన్ని అభివృద్ధి పనులు చేయిస్తున్న కోరుకంటి చందరన్న రేపు మంత్రి పదవిని అలంకరిస్తే రామగుండంలో రెట్టింపు అభివృద్ధి జరుగుతుందని ప్రజలంతా అదే నమ్మకంతో ఉన్నారని పేర్కొన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో రామగుండం కార్పోరేషన్ మేయర్ బింగి అనిల్,  కార్పోరేటర్లు అంజలి,దొంత శ్రీనివాస్, కొమ్ము వేణు, అడప శ్రీనివాస్,నూతి తిరుపతి, దాసరి శ్రీనివాస్, యువజన విభాగం నాయకులు బాసంపెళ్లి జడ్సన్,దొమ్మేటి వాసు ముఖ్య నాయకులు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: